Thursday, October 22, 2009

మెరుగు వంటిది అలమేలుమంగ

మెరుగు వంటిది అలమేలుమంగ అరిమురి నవ్వీనీ అలమేలుమంగ

పలుచని యెలుగున బాడీ నీ మీది పాట మెరుపు గూరిమి నలమేలుమంగ
చెలులతో నీ సుద్ది చెప్పి చెప్పి కరగీని అలయుచు సొలయుచు నలమేలుమంగ

ఈడుగా నీ రాకకు నెదురెదురు చూచీ మేడ మీద నుండి యలమేలుమంగ
వాడు మోముతో నీపై వలపు చల్లి చల్లి ఆడీ నాట్యము సారే నలమేలుమంగ

పేరుకొని పిలిచీని ప్రియములు చెప్పి చెప్పి మేర మీర నిన్ను నలమేలుమంగ
రీతి శ్రీవేంకటేశ నిన్ను గూడె నేడు ఆరితేరి నన్నిటాను అలమేలుమంగ

merugu vamtidee alamelu manga arimuri naveeni alamelu manga

paluchani yeluguna paadee nee meedi paata merupu koorimee alamelu manga
chelulato nee suddi cheppi cheppi cheppi karageeni alayuchu solayuchu alamelu manga

eedugaa nee raakaku nedureduru choochee mEda meedi nundi alamelu mangaa
vaadu momu to nee pai valapulu challi challi aadee naatyamu saare nalamelu mangaa

perukoni pilachee ni priyamulu cheppi cheppi mera meera ninnu nalamelu manga
ee reeti shree venkatesa ninnu koode nedu aari tere nannitaanu alamelu manga

నవరసములదీ నలినాక్షి

నవరసములదీ నలినాక్షి జవకట్టి నీకు జవి సేసీని

శృంగార రసము చెలియ మొకంబున సంగతి వీరరసము గోళ్ల
రంగగు కరుణరసము పెదవులను అంగపు గుచముల నద్భుత రసము

చెలి హాస్యరసము చెలవుల నిండీ పలుచని నడుమున భయరసము
కలికి వాడు గన్నుల భీభత్సము అలబొమ జంకెనల నదె రౌద్రంబు

రతి మరపుల శాంత రసంబదే అతి మోహము పదియవరసము
ఇత్వుగ శ్రీవేంకటేశ కూడితివి సతమై యీపెకు సంతోస రసము

తరుణీ నీయలుక కెంతటిది ఇంతి

తరుణీ నీయలుక కెంతటిది ఇంతి నీవేళ కరుణించగదర వేంకట శైలనాధ

ఒకమారు సంసారమొల్ల బొమ్మని తలచు ఒకమారు విధి సేతలు ఊహించి పొగడు
ఒక మారు తను జూచి వూరకే తలవూచు నొకమారు హర్షమున నొంది మేమరచు

నిను జూచి నొకమారు నిలువెల్ల పులకించు తను జూచి నొకమారు తలపోసి నగును
కనుదెరచి నిను జూచి కడు సిగ్గుపడి నిలిచి ఇన్ని యును తలపోసి ఇంతలోమరచు

వదలైన మొలనూలు గదియించు నొకమారు చెదరిన కురులెల్ల చెరగు నొకమారు
అదనెరిగి తిరు వెంకతాదీశ వేంకటాధీశ పొందితివి చదురుడవు బాయ జాలదొకమారు

చిత్తజ గరుడ నీకు శ్రీమంగళం

చిత్తజ గరుడ నీకు శ్రీమంగళం నా చిత్తములో హరి నీకు శ్రీమంగళం

బంగారు బొమ్మవంటి పడతి నురము మీద సింగారించిన నీకు శ్రీమంగళం

రంగు మీర పీతాంబరము మొల గట్టు కొని చెంగిలించే హరి నీకు శ్రీమంగళం

వింత నీలము వంటి వెలదిని పాదముల చేత బుట్టించిన నీకు శ్రీమంగళం

కాంతుల కౌస్తుభమణి గట్టుక భక్తులకెల్లా చింతామణి వైన నీకు శ్రీమంగళం

అరిది పచ్చల వంటి యంగన శిరసు మీద సిరుల దాల్చిన నీకు శ్రీమంగళం

గరిమ శ్రీ వేంకటేశ ఘన సంపదల తోడి సిరివర నీకు నివే శ్రీమంగళం

క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని

క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని నీరజాలయమునకు నీరాజనం

జలజాక్షి మోమునకు జక్కన కుచంబులకు నెలకొన్న కప్పురపు నీరాజనం
అలివేణి తురుమునకు హస్త కమలంబులకు నిలువు మాణిక్యముల నీరాజనం

చరణ కిసలయములకును సకియలంభోరులకు నిరతమగు ముత్తేల నీరాజనం
అరిది జఘనంబునకు నతివ నిజ నాభికిని నిరతి నానా వర్ణ నీరాజనం

సగటు శ్రీ వెంకటేశు పట్టపు రాణియై నెగడు సతి కళలకును నీరాజనం
జగతి నలమేల్మంగ జక్కదనములకెల్ల నిగుడు నిజ శోభనపు నీరాజనం

చక్రమా హరి చక్రమా

చక్రమా హరి చక్రమా వక్రమైన దనుజుల వక్కలించవో

చుట్టి చుట్టి పాతాళము చొచ్చి హిరణ్యాక్షుని చట్టలు చీరిన వో చక్రమా
పట్టిన శ్రీ హరి చేత బాయక జగములు వొట్టుకొని కావగదవో వో చక్రమా

పానుకొని దనుజుల బలు కిరీటమనుల సానలదిరిన వో చక్రమా
నానా జీవముల ప్రాణములు గాచి ధర్మ మూని నిలుపగదవో వో చక్రమా

వెరచి బ్రహ్మాదులు వేద మంత్రములని పురట్లు గొనియాడే రో చక్రమా
అరిమురి దిరు వెంకతాద్రీషు వీధుల వొరవుల మెరయుదు వో చక్రమా

కొలువుడీ భక్తీ

కొలువుడీ భక్తీ కొండల కోనేటి నిలయుని శ్రీ నిధి యైనవాని

ఆది దేవుని నభవుని సామ వేద నాద వినోదుని నేర
వాడి జిత ప్రియు నిర్మలత త్వ వాదుల జీవనమైన వాని

దేవదేవుడైన దివ్యుని సర్వ భావాతీత స్వభావుని
శ్రీ వెంకటగిరి దేవుడైన పర దేవుని భుదేవతత్పరుని