క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని నీరజాలయమునకు నీరాజనం
జలజాక్షి మోమునకు జక్కన కుచంబులకు నెలకొన్న కప్పురపు నీరాజనం
అలివేణి తురుమునకు హస్త కమలంబులకు నిలువు మాణిక్యముల నీరాజనం
చరణ కిసలయములకును సకియలంభోరులకు నిరతమగు ముత్తేల నీరాజనం
అరిది జఘనంబునకు నతివ నిజ నాభికిని నిరతి నానా వర్ణ నీరాజనం
సగటు శ్రీ వెంకటేశు పట్టపు రాణియై నెగడు సతి కళలకును నీరాజనం
జగతి నలమేల్మంగ జక్కదనములకెల్ల నిగుడు నిజ శోభనపు నీరాజనం
Thursday, October 22, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment