Thursday, October 22, 2009

చిత్తజ గరుడ నీకు శ్రీమంగళం

చిత్తజ గరుడ నీకు శ్రీమంగళం నా చిత్తములో హరి నీకు శ్రీమంగళం

బంగారు బొమ్మవంటి పడతి నురము మీద సింగారించిన నీకు శ్రీమంగళం

రంగు మీర పీతాంబరము మొల గట్టు కొని చెంగిలించే హరి నీకు శ్రీమంగళం

వింత నీలము వంటి వెలదిని పాదముల చేత బుట్టించిన నీకు శ్రీమంగళం

కాంతుల కౌస్తుభమణి గట్టుక భక్తులకెల్లా చింతామణి వైన నీకు శ్రీమంగళం

అరిది పచ్చల వంటి యంగన శిరసు మీద సిరుల దాల్చిన నీకు శ్రీమంగళం

గరిమ శ్రీ వేంకటేశ ఘన సంపదల తోడి సిరివర నీకు నివే శ్రీమంగళం

No comments:

Post a Comment