Saturday, August 8, 2009

ఇట్టి ముద్దు లాడి బాలుడేడవాడు వాని

ఇట్టి ముద్దు లాడి బాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు వోయరే

కామిడి పారిదెంచి కాగెడి వెన్న లోన చేమ పూవు కడియాల చేయి పెట్టి
చీమ గుట్టేనానని చక్కిట కన్నీరు జార వేమరు వాపోయె వాని వెడ్డు వెట్టరే

ముచ్చు వలె వచ్చి తన ముంగిట మురువుల చేయి తచ్చెడి పెరుగు లోన తగ వెట్టి
నొచ్చెనని చేయి దీసి నోరి నెల్ల జొల్లు గార వొచ్చెలి వాపోవు వాని నూరడించరే

ఎప్పుడు వచ్చెనో మా ఇల్లు జొచ్చి పెట్టె లోని చెప్పరాని వుంగరాల చేయి పెట్టి
అప్పడైన వేంకటేశుడా సపాలకుడు గాన తప్పకుండ బెట్టె వాని తల కేత్తరే

No comments:

Post a Comment