Thursday, August 6, 2009

ముద్దుగారే యశోద ముంగిట

ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు తిద్దరాని మహిమల దేవకీ సుతుడు

అంత నింత గొల్లెతల అరచేతి మాణిక్యము పంత మాడే కంసుని పాలి వజ్రము
కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు

రాతి కేళి రుక్మిణికి రంగు మోవి పగడము మితి గోవర్ధనపు గోమేధికము
సతమై శంఖ చక్రాల సందుల వైడూర్యము గతియై మమ్ము గాచేటి కమలాక్షుడు

కాళింగుని తలలపై కప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీవేంకటాద్రి ఇంద్ర నీలము
పాలజల నిధి లోని పాయని దివ్యరత్నము బాలుని వలె తిరిగి పద్మ నాభుడు

No comments:

Post a Comment