Thursday, August 6, 2009

చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు జాలెల్ల

చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు జాలెల్ల నడగించు సంకీర్తనం

సంతోష కరమైన సంకీర్తనం సంతాప మణగించు సంకీర్తనం
జంతువుల రక్షించు సంకీర్తనం సంతతము దలచుడీ సంకీర్తనం

సామజము గాంచినది సంకీర్తనం సామమున కెక్కుడీ సంకీర్తనం
సామీప్య మిందరికి సంకీర్తనం సామాన్య మా విష్ణు సంకీర్తనం

జాము బారి విడిపించు సంకీర్తనం సమ బుద్ధి వొడ మించు సంకీర్తనం
జమళి సౌఖ్యము లిచ్చు సంకీర్తనం శమదమాదుల జేయు సంకీర్తనం

జలజాసనుని నోరి సంకీర్తనం చలిగొండ సుతదలచు సంకీర్తనం
చలవ గడు నాలుక కు సకీర్తనం చలపట్టి తలచుడీ సంకీర్తనం

సరవి సంపద లిచ్చు సంకీర్తనం సరి లేని దిదియ పో సంకీర్తనం
సరుస వేంకట విభుని సంకీర్తనం సరుసగను దలచుడీ సంకీర్తనం

No comments:

Post a Comment