Thursday, August 6, 2009

కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు

కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు కొండలంత వరములు గుప్పెడు వాడు

కుమ్మర దాసుడైన కురువరతి నంబి ఇమ్మన్న వారము లెల్ల నిచ్చిన వాడు
దొమ్ములు సేసినయట్టి తొండమాం చక్కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మిన వాడు

అచ్చపు వేడుక తోడ ననంతాలువారికి ముచ్చిలి వెర్రికి మన్ను మోచిన వాడు
మచ్చిక దొలక దిరుమల నంబి తోడుత నిచ్చ నిచ్చ మాట లాడి నొచ్చిన వాడు

కంచి లోన నుండ దిరు కచ్చి నంబి మీద కరుణించి తన యెడకు రప్పించిన వాడు
ఎంచి ఎక్కుడైన వేంకటేశుడు మనలకు మంచి వాడి కరుణ బాలించిన వాడు

No comments:

Post a Comment