Thursday, August 6, 2009

పసిడియక్షింతలివే పట్టరో వేగమే రారారో

పసిడి యక్షింతలివే పట్టరో వేగమే రారారో దెసల పేరంటాండ్లు దేవుని పెండ్ల్కిని

శ్రీ వెంకటేశ్వరునికి శ్రీ మహాలక్ష్మికి దైవికపు పెండ్లి ముహూర్తము నేడు
కావించి భేరులు మ్రోసె గరుడ ధ్వజంబెక్కే దేవతలు రారో దేవుని పెండ్లికిని

కందర్ప జనకునికి కమలాదేవికి పెండ్లి పందిలి లోపల తలంబాలు నేడు
గంధమూ వీడే మిచ్చేరు కలుపడాలు గట్టిరి అందుక మునులు రారో హరి పెండ్లికిని

అదే శ్రీ వేంకటపతికి అలమేలు మంగకును మొదలి తిరుఆల్లకు తిరునాళ్ళకు మ్రొక్కేము నేడు
ఎదుట నేగేరు వీరే ఇచ్చేరు వరము లివె కదలి రారో పురుష ఘనులు పెండ్లికిని

No comments:

Post a Comment