Friday, August 7, 2009

అలర చంచలమైన ఆత్మలందుండ

అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసే నీ వుయ్యాల
పలుమారు నుచ్చ్వాస పవనమందుండ నీ భవంబు దేలిపే నీ వుయ్యాల

వుదాయాస్తాశైలంబు లోనర కంభములైన వుడు మండలము మోచె నుయ్య్హాల
అదన ఆకాశ పదము అడ్డౌ దూలంబైన అఖిలంబు నిండే నీ వుయ్యాల

పదిలముగా వేదములు బంగారు చేరులై పట్టి వెరపై తోచే వుయ్యాల
వదలకిటు ధర్మ దేవత పీఠమై మిగుల వర్ణింప నరుదాయె వుయ్యాల

మేలు కట్లై మీకు మేఘమండలమెల్ల మెరుగునకు మెరుగాయె వుయ్యాల
నీల శైలము వంటి నీ మేని కాంతికి నిజమైన తోడవాయే వుయ్యాల

పాలిండ్లు కదలగా పయ్యేదలు రాపాడ భామినులు వడినూచు వుయ్యాల
వొలి బ్రహ్మాండములు వోరగువోయని భీతి నొయ్య నొయ్య నైరి వూచిరుయ్యాల

కమలకును భూపతికి కదలు కదలకు మిమ్ము కౌగలిన్పగజేసే నుయ్యాల
అమరాంగనలకు నీ హాస భావ విలాస మందంద చూపే నీ వుయ్యాల

కమలాసనాదులకు కన్నుల పండుగై గణుతింప నరుదాయె వుయ్యాల
కమనీయ మూర్తి వేంకశైలపతి నీకు కడు వేడుకై వుండే వుయ్యాల

No comments:

Post a Comment