రాముడే రాఘవుడు రవికులుడితడు భూమిజకు పతియైన పురుష నిధానము
అరయ పుత్రకామేష్టి యందు పరమాన్నమున పరగ జనించిన పరబ్రహ్మము
సురల రక్షింపగా అసురుల సిక్షిమ్పగా తిరమై వుదయించిన దివ్యతేజము
చింతించు యోగీంద్రుల చిత్తసరోజములలో సంతతము నిలిచిన సాకారము
వింతలుగా మునులెల్ల వెదకిన యట్టి కాంతుల చెన్ను మీరిన కైవల్య పదము
వేద వేదాన్తములందు విజ్ఞాన శాస్త్రము లందు పాదుకొని బలికేటి పరమార్ధము
పొదితో శ్రీవెంకటాద్రి పొంచి విజయనగరాన ఆదికనాదియైన అర్చావతారము
Thursday, August 20, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment