Thursday, August 20, 2009

జ్ఞానయజ్ఞమీగతి మోక్షసాధనము నానార్ధములు

జ్ఞానయజ్ఞమీగతి మోక్ష సాధనము నానార్ధములు నిన్నే నడపె మా గురుడు

అలరి దేహమనేటి యాగశాల లోన బలువై యజ్ఞానపుపశువు బంధించి
కలసి వైరాగ్యపు కత్తుల గోసి కోసి వెలయు జ్ఞానాగ్నిలో వేలిచే మా గురుడు

మొక్కుచు వైష్ణవులనేముని సభ గూడ పెట్టి చొక్కుచు శ్రీ పాదతీర్ధసోమపానము నించి
చక్కగా సంకీర్తనసామగానము చేసి యిక్కువ తో యజ్ఞము సేయించేబో మా గురుడు

తదియ్యగురు ప్రసాదపు పురోడాశామిచ్చి కొదదీర ద్వయమను కుండలంబులు వెట్టి
యెదలో శ్రీ వెంకటేశు నిటు ప్రత్యక్షముచేసే యిదివో స్వరూప దీక్షయిచ్చెను మా గురుడు

No comments:

Post a Comment