Saturday, August 8, 2009

ఎంత మాత్రమున నెవ్వరు దలచిన అంత మాత్రమే నీవు

ఎంత మాత్రమున నెవ్వరు దలచిన అంత మాత్రమే నీవు
అంతరాంతరములెంచి చూడ పిండంతే నిప్పటి యన్నట్లు

కొలుతురు మిము వైష్ణవులు కూరిమితో విష్ణుడని
పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మంబనుచు
తలతురు మిము శైవులు తగిన భక్తులను శివుడనుచు
అలరి పొగడుదురు కాపాలికులు ఆది భైరవుడవనుచు

సరి నెన్నుదురు శాక్తేయులు శక్తి రూపు నీ వనుచు
దరిశనములు మిము నానా విధులను తలపుల కొలదుల భజింతురు
సిరుల మిమ్మునే యల్ప బుద్ధి దలచిన వారికి నల్పంబవుదువు
గరిమల మిమ్మునే ఘనమని తలచిన ఘన బుద్ధులకు ఘనుడవు

నీ వలన గోరతే లేదు మరి నీరు కొలది తామెరవు
ఆవల భాగీరధి దరి బావుల ఆజలమే వూరినట్లు
శ్రీ వేంకటపతి నీవైతే మము జేకొని వున్నదైవమని
యీవలనే నీ శరణని ఎదను ఇదియే పరతత్వము నాకు

No comments:

Post a Comment