Thursday, August 6, 2009

సేవించరో జనులాల చేతులెత్తి మొక్కరో

సేవించరో జనులాల చేతులెత్తి మొక్కరో వావిరి ప్రహ్లాదునికి వరదుడు వీడే

జగన్నాధుడు వీడే సర్వ రక్షకుడు వీడే నిగమ వేద్యుడైన నిత్యుడు వీడే
సుగుణ వంతుడు వీడే సర్వ కాముడు వీడే నగు మొగము సుగ్రీవ నరసింహుడు వీడే

మరు జనకుడు వీడే మహిమాధికుడు వీడే పరగ శ్రీలక్ష్మి పతియు వీడే
సురులకేలిక వీడే శుభ మూరుతి వీడే నరసఖుడు సుగ్రీవనరసిహుడు వీడే

భువనాధిపతి వీడే పురుషోత్తముడు వీడే వివిధ ప్రతాప కోవిదుడు వీడే
ఈవల శ్రీ వేంకటాద్రి నిరవైనతదు వీడే నవమూర్తి సుగ్రీవ నరసింహుడు వీడే

No comments:

Post a Comment