కొలిచిన వారల కొంగు పైడితడు బలిమి తారక బ్రహ్మమీతడు
ఇన వంశాంబుధి నెగసిన తేజము ఘన యజ్ఞంబుల గల ఫలము
మనుజ రూపమున మనియెడి బ్రహ్మము నినువుల రఘుకుల నిధాన మీతడు
పరమాన్నము లోపలి సారపుజవి పరగినది విజుల భయ హరము
మరిగిన సీతా మంగళ సూత్రము ధరలో రామావతారంబితడు
చకిత దానవుల సంహారచక్రము సకల వనచరుల జయకరము
వికసితమగు శ్రీ వేంకట నిలయము ప్రకటిత దశరధ భాగ్యంబితడు
Thursday, August 6, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment