Thursday, August 20, 2009

విజాతులన్నియు వృధా వృధా అజామిళాదుల

విజాతులన్నియు వృధా వృధా అజామిళాదుల కదియేజాతి

జాతి భేదములు శరీర గుణములు జాతి శరీరము సరి తోడనే చెడు
ఆతుమ పరిశుద్ధంబెప్పుడును అది నిర్దోషంబనాది
ఈతల హరి విజ్ఞానపు దాస్యం ఇదియొక్క టేపో

హరి ఇందరిలో నంత రాత్ముడిదే
ధరణి జాతి భేదము లెంచిన
పరమ యోగులీ భావ మష్టమదము భావ వికారమని మానిరి
ధరణి లోన పరతత్త్వ జ్ఞానము ధర్మ మూలమే సుజాతి

లౌకిక వైదిక లంపటులకు నివి
కైకొను నవశ్య కర్తవ్యంబులు
శ్రీ కాంతుడు శ్రీ వేంకటపతి సేసిన సంపాదన మిందరికి
మేకొని ఇన్నియు మీరిన వారికి మీ నామమే సుజాతి

No comments:

Post a Comment