Saturday, December 5, 2009

Annamayya108 Schedule

Song Schedule for Annamayya 108 at Hindu Temple of Calgary
on
January 9, 2010

Please be at the temple AT LEAST 1 HOUR before your time slot

Thank you,
Organizers

The samkeerthans are sorted in alphabetical order:



Samkeerthana Time
Adaro Padaro apsaro ganamu 10:50 AM
Adi gaka nijamatambadi 5:00 PM
Adivo alladivo sri hari vasamu 3:35 PM
alara chanchalamian aatmalandu 11:25 AM
Alarulu kuriyaga 12:05 PM
Anadi Jagamuna 1:55 PM
ani anaticche krishnudu 3:40 PM
anjaneya anilaja 12:25 PM
Anni mantramulu inde 5:45 PM
Anni vibhavamula atadithadu 12:15 PM
Antaryami alasiti 6:20 PM
Antayu neeve 1:15 PM
Appanee Vara Prasadi 6:33 AM
araginchi koochunnadalla vade 10:35 AM
ayameva ayameva adipurusho 4:45 PM
Bhavayami gopala balam 1:10 PM
Bramha Kadigina Padam 3:55 PM
Chakkani talliki changubhala 11:20 AM
Chalada Hari nama sokhyamrutam 2:30 PM
Cheri yasodaku sisuvitadu 1:35 PM
Chinni sisuvu chinni sisuvu 1:20 PM
Chirutha navvula vadu sinnekka 12:50 PM
chooda chooda manikyalu chukkala 10:15 AM
dachuko nee paadalaku 6:30 PM
Deva devam bhaje 2:05 PM
dinamu dvadasi nedu 10:30 AM
dolayamchala 9:55 AM
Ekkadi manusha janmam 6:25 PM
enta matramuna evvaru thalachina 4:55 PM
entha kalamu kada ee deha dharanamu 6:00 PM
Garuda gamana 3:10 PM
Govindaachuta gokula brunda 2:20 PM
gurutherigina donga koogoogooo 3:25 PM
Hari kolichi mari aparamula 3:50 PM
hari namamoo kadu ananda karamu 5:35 PM
harikrishna melukonu adi purusha 6:38 AM
Ihapara sadhana idi okate 5:25 PM
Indariki abhayammu 3:05 PM
itadokade sarveswarudu 4:40 PM
itti mudduladi baludeda 1:50 PM
jagadapu chanavula jaajara 11:40 AM
Jaya jaya rama samara vijaya rama 2:10 PM
jaya mangalamu neeku sarveswara 11:50 AM
jnana yagna meegathi moksha sadhanamu 4:30 PM
jo jo angajuni ganna maa yanna itu rara 11:30 AM
kanti akhilanda kartha nadhikuni ganti 2:45 PM
kanti kanti niluvu 10:10 AM
kanti sukravaramu 9:35 AM
kavumani telupumu 12:10 PM
Kolani dopariki 1:30 PM
koluvai unnadu veede govinda raju 4:10 PM
koluvudee bhakti kondala koneti nilayuni 12:45 PM
Kommalala yenthavade govindaraju 2:55 PM
kondalalo nelakonna koneti rayadu 2:35 PM
ksheerabdi kanyakaku sree mahalakshmikini 11:55 AM
Kulukaga Nadavaro kommalala 12:55 PM
Madhava kesava 2:50 PM
manasija samudra madhanamide 11:45 AM
marda marda mama bandhani 12:30 PM
Matsya kurma varaha 3:20 PM
Maya moham 6:05 PM
Mikkili meludi alamelumanga 11:15 AM
Muddugare yasoda 1:25 PM
Muddulu momuna munchaganu 1:40 PM
naanaati brathuku naatakamu 5:55 PM
Nagavulu nijamani nammeda 5:50 PM
nallani meni nagavu choopula vadu 4:05 PM
Namo Namo Danava Vinasa chakrama 12:35 PM
namo narayanaya namo 4:20 PM
narayana nee namame gati ika 5:20 PM
Narayanathe namo namo 3:00 PM
natanala bhramayaku mansa 5:05 PM
navarasamuladee nalinaakshi 11:05 AM
nee namame maku nidhiyu nidhanamu 5:30 PM
nitya poojalivigo 10:25 AM
o pavanatmaja 12:20 PM
Okapari kokapari 9:45 AM
paluku tenela talli pavvalinchenu 10:55 AM
Paramapurusha 4:25 PM
pasidi akshantalive pattaro vegame 9:50 AM
Phalanetranala prabala vidyullatha 2:00 PM
pidikita thalambrala pendli koothuru 10:45 AM
Podagantimayya 3:30 PM
pulakala molakala 10:00 AM
purshottamuda veevu purshadhamuda nenu 4:50 PM
Rama Dasaratha rama 2:15 PM
Ramudu raghavudu ravikulithadu 4:00 PM
Sakalam he sakhi 11:00 AM
Sarvopaayamula jagati naku 5:15 PM
sevimparo janulala 6:53 AM
sharanu sharanu surendra sannutha 6:10 PM
shodasa kalanidhiki 10:20 AM
singara moorithivi chittaja gurudavu 10:40 AM
Srimannarayana srimanna 4:15 PM
Suprabhatam 6:43 AM
te saranamaham te saranamaham 6:15 PM
thandana aahi 4:35 PM
Tiro Tiro Javarala 11:10 AM
Tirumala giri raya 2:25 PM
uyyala oopulu 12:00 PM
vaccenu alamelu manga 9:40 AM
Valapula solapula vasantha vela 11:35 AM
Vande vasudevam 1:05 PM
Vasudha chooda 3:15 PM
vedukondama vedukondama venkatagiri 2:40 PM
veede gade seshudu 12:40 PM
Vetti valapu challaku 3:45 PM
vijathulanniyu vrudha vrudha 5:10 PM
vinaro bhagyamu vishnu katha 5:40 PM
Vinnapalu vinavale 9:30 AM
Yedutanunnadu veede ee baludu 1:45 PM
Yemani pogadudune 10:05 AM

Thursday, October 22, 2009

మెరుగు వంటిది అలమేలుమంగ

మెరుగు వంటిది అలమేలుమంగ అరిమురి నవ్వీనీ అలమేలుమంగ

పలుచని యెలుగున బాడీ నీ మీది పాట మెరుపు గూరిమి నలమేలుమంగ
చెలులతో నీ సుద్ది చెప్పి చెప్పి కరగీని అలయుచు సొలయుచు నలమేలుమంగ

ఈడుగా నీ రాకకు నెదురెదురు చూచీ మేడ మీద నుండి యలమేలుమంగ
వాడు మోముతో నీపై వలపు చల్లి చల్లి ఆడీ నాట్యము సారే నలమేలుమంగ

పేరుకొని పిలిచీని ప్రియములు చెప్పి చెప్పి మేర మీర నిన్ను నలమేలుమంగ
రీతి శ్రీవేంకటేశ నిన్ను గూడె నేడు ఆరితేరి నన్నిటాను అలమేలుమంగ

merugu vamtidee alamelu manga arimuri naveeni alamelu manga

paluchani yeluguna paadee nee meedi paata merupu koorimee alamelu manga
chelulato nee suddi cheppi cheppi cheppi karageeni alayuchu solayuchu alamelu manga

eedugaa nee raakaku nedureduru choochee mEda meedi nundi alamelu mangaa
vaadu momu to nee pai valapulu challi challi aadee naatyamu saare nalamelu mangaa

perukoni pilachee ni priyamulu cheppi cheppi mera meera ninnu nalamelu manga
ee reeti shree venkatesa ninnu koode nedu aari tere nannitaanu alamelu manga

నవరసములదీ నలినాక్షి

నవరసములదీ నలినాక్షి జవకట్టి నీకు జవి సేసీని

శృంగార రసము చెలియ మొకంబున సంగతి వీరరసము గోళ్ల
రంగగు కరుణరసము పెదవులను అంగపు గుచముల నద్భుత రసము

చెలి హాస్యరసము చెలవుల నిండీ పలుచని నడుమున భయరసము
కలికి వాడు గన్నుల భీభత్సము అలబొమ జంకెనల నదె రౌద్రంబు

రతి మరపుల శాంత రసంబదే అతి మోహము పదియవరసము
ఇత్వుగ శ్రీవేంకటేశ కూడితివి సతమై యీపెకు సంతోస రసము

తరుణీ నీయలుక కెంతటిది ఇంతి

తరుణీ నీయలుక కెంతటిది ఇంతి నీవేళ కరుణించగదర వేంకట శైలనాధ

ఒకమారు సంసారమొల్ల బొమ్మని తలచు ఒకమారు విధి సేతలు ఊహించి పొగడు
ఒక మారు తను జూచి వూరకే తలవూచు నొకమారు హర్షమున నొంది మేమరచు

నిను జూచి నొకమారు నిలువెల్ల పులకించు తను జూచి నొకమారు తలపోసి నగును
కనుదెరచి నిను జూచి కడు సిగ్గుపడి నిలిచి ఇన్ని యును తలపోసి ఇంతలోమరచు

వదలైన మొలనూలు గదియించు నొకమారు చెదరిన కురులెల్ల చెరగు నొకమారు
అదనెరిగి తిరు వెంకతాదీశ వేంకటాధీశ పొందితివి చదురుడవు బాయ జాలదొకమారు

చిత్తజ గరుడ నీకు శ్రీమంగళం

చిత్తజ గరుడ నీకు శ్రీమంగళం నా చిత్తములో హరి నీకు శ్రీమంగళం

బంగారు బొమ్మవంటి పడతి నురము మీద సింగారించిన నీకు శ్రీమంగళం

రంగు మీర పీతాంబరము మొల గట్టు కొని చెంగిలించే హరి నీకు శ్రీమంగళం

వింత నీలము వంటి వెలదిని పాదముల చేత బుట్టించిన నీకు శ్రీమంగళం

కాంతుల కౌస్తుభమణి గట్టుక భక్తులకెల్లా చింతామణి వైన నీకు శ్రీమంగళం

అరిది పచ్చల వంటి యంగన శిరసు మీద సిరుల దాల్చిన నీకు శ్రీమంగళం

గరిమ శ్రీ వేంకటేశ ఘన సంపదల తోడి సిరివర నీకు నివే శ్రీమంగళం

క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని

క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని నీరజాలయమునకు నీరాజనం

జలజాక్షి మోమునకు జక్కన కుచంబులకు నెలకొన్న కప్పురపు నీరాజనం
అలివేణి తురుమునకు హస్త కమలంబులకు నిలువు మాణిక్యముల నీరాజనం

చరణ కిసలయములకును సకియలంభోరులకు నిరతమగు ముత్తేల నీరాజనం
అరిది జఘనంబునకు నతివ నిజ నాభికిని నిరతి నానా వర్ణ నీరాజనం

సగటు శ్రీ వెంకటేశు పట్టపు రాణియై నెగడు సతి కళలకును నీరాజనం
జగతి నలమేల్మంగ జక్కదనములకెల్ల నిగుడు నిజ శోభనపు నీరాజనం

చక్రమా హరి చక్రమా

చక్రమా హరి చక్రమా వక్రమైన దనుజుల వక్కలించవో

చుట్టి చుట్టి పాతాళము చొచ్చి హిరణ్యాక్షుని చట్టలు చీరిన వో చక్రమా
పట్టిన శ్రీ హరి చేత బాయక జగములు వొట్టుకొని కావగదవో వో చక్రమా

పానుకొని దనుజుల బలు కిరీటమనుల సానలదిరిన వో చక్రమా
నానా జీవముల ప్రాణములు గాచి ధర్మ మూని నిలుపగదవో వో చక్రమా

వెరచి బ్రహ్మాదులు వేద మంత్రములని పురట్లు గొనియాడే రో చక్రమా
అరిమురి దిరు వెంకతాద్రీషు వీధుల వొరవుల మెరయుదు వో చక్రమా

కొలువుడీ భక్తీ

కొలువుడీ భక్తీ కొండల కోనేటి నిలయుని శ్రీ నిధి యైనవాని

ఆది దేవుని నభవుని సామ వేద నాద వినోదుని నేర
వాడి జిత ప్రియు నిర్మలత త్వ వాదుల జీవనమైన వాని

దేవదేవుడైన దివ్యుని సర్వ భావాతీత స్వభావుని
శ్రీ వెంకటగిరి దేవుడైన పర దేవుని భుదేవతత్పరుని

Thursday, August 20, 2009

హరి నీవే సర్వాత్మకుడవు యిరవగు భావన

హరి నీవే సర్వాత్మకుడవు యిరవగు భావన యియ్యగదే

చూడక మానవు చూచేటి కన్నులు యెడ నేవైనా యితరములు
నీడల నింతా నీ రూపము లని యీడు వాడని తెలివియ్య గదే

పారక మానదు పాపపు మనసిది ఈ రసములతో నేన్దైనా
నీర జాక్ష యిది నీ మయమేయని ఈ రీతుల తలపియ్య గదే

కలుగక మానవు కాయపు సుఖములు యిల లోపల గల వెన్నైనా
అలరిన శ్రీ వెంకటాధిప నీకే ఎలా నర్పితమను యేహ మియ్య గదే

దేహి నిత్యుడు దేహములనిత్యాలు యీహల

దేహి నిత్యుడు దేహము లనిత్యాలు యీహల నా మనసాయిది మరవకుమీ

గుది బాతచీర మాని కొత్త చీర గట్టి నట్టు ముదిమేను మాని దేహి మొగి గొత్త మేను మోచు
అదన జంపగలేవు ఆయుధము లీతని గదిసి యగ్నియు నీరు గాలియు జంపగ లేవు

యీతడు నరకపడ డీత డగ్నిగాలడు యీతడు నీట మునుగ డీతడు గాలి బోడు
చేతనుడై సర్వగతున్దౌ చెలియించడేమిటను యీతల ననాది ఈత దిరావు గదలడు

చేరి కాన రాని వాడు చింతించరాని వాడు భారపువి కారాల బాసిన వాడీ యాత్మ
అరయ శ్రీ వెంకటేశు నాధీన మీతడని సారము దేలియుటే సత్యం జ్ఞానము

మరి ఎందూ గతి లేదు మనుప నీవే దిక్కు జరసి

మరి యందు గతి లేదు మనుప నీవే దిక్కు జరసి లక్ష్మి శ నీ శరణమే దిక్కు

భావ సాగరంబులో బడి మునిగిన నాకు తివిరి నీ నామమనుతెపాయే దిక్కు
చివికి కర్మంబు నేడీ చిచ్చు చొచ్చిన నాకు జవళి నాచార్యు కృప జలధియే దిక్కు

ఘన మోహపాశముల గాలి బోయ్యేది నాకు కొనల నీ పాద చింత కొమ్మయే దిక్కు
కవలి మనసనెదియాకనమున నున్న నాకు కనుగొనగ నీదాస్య గరుడడే దిక్కు

మరిగి సంసారమనెడి మంటి కిందటి నాకు ధర భక్తి యను బిలద్వారమే దిక్కు
యిరవైన శ్రీ వేంకటేశ ఇన్నిటా నాకు నరుదైన నీవంతరాత్మవే దిక్కు

నారాయణ నీ నామ మేగతి ఇక కోర్కెలు నాకు

నారాయణ నీనామ మేగతి ఇక కోర్కెలు నాకు కొనసాగుటకు

పైపై ముందట భావ జలధి దాపు వెనక చింతాజలధి
చాపలము నడుమ సంసారజలధి తేపయేది ఇది తెగ నీదుటకు

పండే నెడమ పాపపు రాశి అండ గుడిని పుణ్యపు రాశి
కొండను నడుమ త్రిగుణ రాశి నిండ కుడుచుటకు నిలుకడ ఏది

కింది లోకములు కీడు నరకములు అందేటి స్వర్గాలవె మీద
చెంది యంతరాత్మ శ్రీ వేంకటేశ నీ యందె పరమపద మవల మరేది

నార్రాయణ నీ నామ మేగతి ఇక కోర్కెలు నాకు కొనసాగుటకు

శరణువేడెద యజ్ఞసంభవ శ్రీరామ అరసి

శరణువేడెద యజ్ఞసంభవ శ్రీరామ అరసి రక్షించుము అయోధ్యారామ

రావణుని భజించిన రాఘవ రామ వావిరి విభీషణ వరద శ్రీరామ
సేవనలమేల్మంగతో వేంకటేశుడై ఈవల దాసుల ఏలినట్టి శ్రీరామ

ధారుణిలో దశరధ తనయ రామ చేరిన యహల్యను రక్షించిన రామ
వారిధి బందన కపి వల్లభ రామ తారక బ్రహ్మ మైన సీతాపతి రామ

ఆదిత్య కులాంబుధి మృగాంక రామ హర కోదండ భంజనము చేకొనిన
వేద శాస్త్ర పురాణాది వినుత రామ ఆది గొన్న తాటకా సంహార రామ

విజాతులన్నియు వృధా వృధా అజామిళాదుల

విజాతులన్నియు వృధా వృధా అజామిళాదుల కదియేజాతి

జాతి భేదములు శరీర గుణములు జాతి శరీరము సరి తోడనే చెడు
ఆతుమ పరిశుద్ధంబెప్పుడును అది నిర్దోషంబనాది
ఈతల హరి విజ్ఞానపు దాస్యం ఇదియొక్క టేపో

హరి ఇందరిలో నంత రాత్ముడిదే
ధరణి జాతి భేదము లెంచిన
పరమ యోగులీ భావ మష్టమదము భావ వికారమని మానిరి
ధరణి లోన పరతత్త్వ జ్ఞానము ధర్మ మూలమే సుజాతి

లౌకిక వైదిక లంపటులకు నివి
కైకొను నవశ్య కర్తవ్యంబులు
శ్రీ కాంతుడు శ్రీ వేంకటపతి సేసిన సంపాదన మిందరికి
మేకొని ఇన్నియు మీరిన వారికి మీ నామమే సుజాతి

రాముడు రాఘవుడు రవికులుడితడు భూమిజ

రాముడే రాఘవుడు రవికులుడితడు భూమిజకు పతియైన పురుష నిధానము

అరయ పుత్రకామేష్టి యందు పరమాన్నమున పరగ జనించిన పరబ్రహ్మము
సురల రక్షింపగా అసురుల సిక్షిమ్పగా తిరమై వుదయించిన దివ్యతేజము

చింతించు యోగీంద్రుల చిత్తసరోజములలో సంతతము నిలిచిన సాకారము
వింతలుగా మునులెల్ల వెదకిన యట్టి కాంతుల చెన్ను మీరిన కైవల్య పదము

వేద వేదాన్తములందు విజ్ఞాన శాస్త్రము లందు పాదుకొని బలికేటి పరమార్ధము
పొదితో శ్రీవెంకటాద్రి పొంచి విజయనగరాన ఆదికనాదియైన అర్చావతారము

మరచితిమంటే మరి లేదు తరితో దలచవో దైవము

మరచితి మంటే మరిలేదు తరితో దలచవో దైవము మనసా

పుట్టుచునున్నది పోవుచునున్నది పట్టపు జీవుల ప్రపంచకము
నట్టనడుమనే హరినామము గుట్టున దలచవో కొనగొని మనసా

పొద్దు వొడుచునదె పొద్దు గుంకునదె తిద్దిన జగముల దినదినము
అద్దపు నీడల అంతర్యామిని వొద్దనే తలచవో ఒనరగ మనసా

లోపల వెలుపల లోగోని వున్నది శ్రీపతి మహిమల సృష్టి యిదే
యేపున శ్రీ వేంకటేశ్వరు డితడే దాపని నమ్ముచు దలచవో మనసా

గరుడాద్రి వేదాద్రి కలిమి ఈపె సిరులోసగీ చూడరో

గరుడాద్రి వేదాద్రి కలిమి ఈపె సిరులోసగీ చూడరో చింతామణి ఈపె

పాల జలధి పుట్టిన పద్మాలయ ఈపె లాలిత శ్రీ నారసింహ లక్ష్మి ఈపె
మేలిమి లోక మాతయై మించిన మగువ ఈపె ఈలీలా లోకములేలే ఇందిరా ఈపె

ఘన సంపద లొసగు కమలాకాంత ఈపె మనసిజుగనిన రామాపతి ఈపె
అనిశము పాయని మహా హరిప్రియ ఈపె ధన ధాన్య రూపపు శ్రీ తరుణీ ఈపె

రచ్చల వెలసినట్టి రమావనిత ఈపె మచ్చికగల అలమేల్మంగ ఈపె
ఇచ్చట వెంకటాద్రి నీ అహోబలము నందు నిచ్చలూ తావుకొనిన నిధానము ఈపె

తే శరణం తే శరణ మహం శైశవకృష్ణ తే శరణం గతోస్మి

తే శరణం తే శరణ మ హం శైశవకృష్ణ తే శరణం గతోస్మి

దశవిధావతార ధర్మరక్షణ మూర్తి దశమస్తకాసురదశన
దశదిశాపరిపూర్ణ తపనీయస్వరూప దశావరణ లోక తత్త్వాతీత

సహస్రలోచన సంతతవినుత సహస్రముఖ శేషశయనా
సహస్రకరకోటి సంపూర్ణ తేజా సహస్రాదిత్య దివ్యచక్రాయుధా

అనంత చరణ సర్వాధారాధేయ అనంతకరదివ్యయుధా
అనంతనిజకళ్యాణగుణార్ణవ అనంత శ్రీవెంకటాద్రినివాసా

జ్ఞానయజ్ఞమీగతి మోక్షసాధనము నానార్ధములు

జ్ఞానయజ్ఞమీగతి మోక్ష సాధనము నానార్ధములు నిన్నే నడపె మా గురుడు

అలరి దేహమనేటి యాగశాల లోన బలువై యజ్ఞానపుపశువు బంధించి
కలసి వైరాగ్యపు కత్తుల గోసి కోసి వెలయు జ్ఞానాగ్నిలో వేలిచే మా గురుడు

మొక్కుచు వైష్ణవులనేముని సభ గూడ పెట్టి చొక్కుచు శ్రీ పాదతీర్ధసోమపానము నించి
చక్కగా సంకీర్తనసామగానము చేసి యిక్కువ తో యజ్ఞము సేయించేబో మా గురుడు

తదియ్యగురు ప్రసాదపు పురోడాశామిచ్చి కొదదీర ద్వయమను కుండలంబులు వెట్టి
యెదలో శ్రీ వెంకటేశు నిటు ప్రత్యక్షముచేసే యిదివో స్వరూప దీక్షయిచ్చెను మా గురుడు

Monday, August 17, 2009

మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినమును

మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినమును దుఖమన్దనేలా

జుట్టెడు గడుపుకై చొరనిచోట్లు చొచ్చి పట్టెడు గూటికై బతిమాలి
పుట్టిన చోటికే పొరలి మనసు పెట్టి వట్టి లంపటము వదలనేరడు గాన

అందరిలో బుట్టి అందరిలో బెరిగి అందరి రూపము లటుదానై
అందమైన శ్రీ వెంకటాద్రీషు సేవించి అందరాని పదమందే నటుగాన

Thursday, August 13, 2009

జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి

జయ లక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలివై హరికి బెరసితివమ్మా

పాలజలధిలోని పసనైన మీగడ మేలిమితామర లోని మించువాసన
నీలవర్ణునురము పై నిండిన నిధానమవై ఏలేవు లోకములు మమ్మేలవమ్మా

చందురుతోడ బుట్టిన సంపదల త్మేరుగావో కందువ బ్రాహ్మలగాచే కల్పవల్లి
అందిన గోవిన్దునికిన్ అండనే తొదూ నీడవై వుందానవు మా ఇంటనే వుండవమ్మా

పదియారు వన్నెలతో బంగారు పతిమ చెదరని వేదముల చిగురు బోడి
ఎదుటా శ్రీవేంకటేశుఁనిల్లాలివై నీవు నిదుల నిలిచే తల్లి నీ వారమమ్మా

శరణంటి మాటని సమ్మంధమున జేసి మరిగించి

శరణంటి మాటని సమ్మంధమున జేసి మరిగించి మము నేలి మన్నించవే

సకల వేదములు సంకీర్తనలు చేసి ప్రకటించి నిను బాడి పావనుడైన
అకలంకుడు తాళ్ళపాకన్నమాచార్యుల వెకలియై ఏలిన శ్రీ వేంకటనిలయ

నారదాది సనక సనందాదుల వలె పేరు పడి నిన్ను బాడి పెద్దలై నట్టి
ఆరీతి దాళ్ళపాకన్నమాచార్యుల చేరి ఏలిన యట్టి శ్రీ వేంకటనిలయ

సామ వేద సామగాన సప్త స్వరములను బాముతో నీ సతి నిన్ను బాడిన యట్టి
ఆము కొన్న తాళ్ళ పాకన్నమా చార్యుల వేమరు మెచ్చిన శ్రీ వెంకట నిలయా

గురు తెరిగిన దొంగ కూగూగు వీడే గురి లోనే

గురు తెరిగిన దొంగ కూగూగు వీడే గురి లోనే దాగీనీ కూగూగు

నెలతల దోచీనీ నీళ్ళాడగానే కొలని దరినీ దొంగ కూగూగు
బలువైన పుట్ల పాలారగించీనీ కొలది మీరిన దొంగ కూగూగు

చల్లలమ్మగా చను కట్టు దొడకీని గొల్లెతలను దొంగ కూగూగు
యిల్లిల్లు దప్పక ఇందరి పాలిండ్లు కొల్లలాడిన దొంగ కూగూగు

తావుకొన్న దొంగ దగిలి పట్టుడిదె గోవులలో దొంగ కూగూగు
శ్రీ వేంకటగిరి చేలువుడో ఏమో కోవిదుడగు దొంగ కూగూగు

జగడపు జనవుల జాజర సగివల మంచపు జాజర

జగడపు జనవుల జాజర సగివల మంచపు జాజర

మొల్లలు దురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున
జల్లన బుప్పొడి జాగర బతిపై చల్లేరతివలు జాజర

భారపు కుచముల పైపై గడు సింగారము నెరపేటి గందవొడి
చేరువ పతిపై చిందగ బడతులు సారెకు జల్లేరు జాజర

బింకపు గూటమి పెనగెటి చమటల పంకపు బూతుల పరిమళము
వేంకటపతి పై వెలదులు నించేరు సంకుమదంబుల జాజర

వేడుకొందామా వెంకటగిరి వేంకటేశ్వరుని

వేడుకొందామా వెంకటగిరి వేంకటేశ్వరుని

ఆమటి మ్రొక్కుల వాడేఆది దేవుడే వాడు తోమని పళ్యాలవాడే దురిత దూరుడే

వడ్డీ కాసులవాడే వనజనాభుడే పుట్టు గొడ్డు రాన్డ్రకు బిడ్డ లిచ్చే గోవిందుడే

ఎలిమి గోరిన వరాలిచ్చే దేవుడే వాడు అలమేల్మంగా శ్రీ వేంకటాద్రి నాధుడే

నమో నారాయణాయ నమో నారాయణాయ

నమో నారాయణాయ నమో నారాయణాయ
నారాయణాయ సగునబ్రహ్మనే సర్వ పారాయణాయ శోభన మూర్తయే నమో

నిత్యాయ విబుధ సంస్తుత్యాయ నిత్యాధి పత్యాయ మునిగణ ప్రత్యయాయ
సత్యాయ ప్రత్యక్షాయ సన్మానససాంగత్యాయ జగదావనక్రుత్యాయతే నమో

ఆక్రమోద్ధత బాహు విక్రమాతిక్రాంత శుక్ర శిష్యో న్ముఓలనక్రమాయ
శక్రాదిగీర్వాన వక్రభయభంగని ర్వక్రాయ నిహతారిచక్రాయ తే నమో

అక్షరాయాటి నిరపెక్షాయ పుండరీకాక్షాయ శ్రీ వత్సలక్షనాయ
అక్షీన విజ్ఞాన దక్ష యోగీన్ద్రసం రక్షానుకంపాకటాక్షాయతే నమో

కరిరాజ వరదాయ కౌస్తుభాభరనాయ మురవైరినే జగన్మోహనాయ
తరునేందు కోటిరతరునీ మనస్త్తోత్ర పరితోషచిట్టాయపరమాయతే నమో

పాత్రదానోత్సవ ప్రధిత వెంకటరాయ ధాత్రీశ కామితార్ధ ప్రదాయ
గోత్రభిన్మని రుచిర గాత్రాయ రవిచంద్ర నేత్రాయ శేషాద్రి నిలయాయతే నమో

బండి విరచి పిన్న పాపలతో నాది దుండగీడు

బండి విరచి పిన్న పాపలతో నాడి దుండగీడు వచ్చే దోబూచి

వెరుగు వెన్నలు బ్రియమునవే మరు ముచ్చి లించు మాయ కాదు
వేరవున్నా దన విధము దాచుకొని దొరదొంగ వచ్చే దోబూచి

పడచు గుబ్బెత పరపుపై పోక ముడి గొంగు నిద్రముంపునను
పడియు దా వద్ద బవలించినట్టి తడుకు దొంగ వచ్చే దోబూచి

గోల్లెపల్లె లో ఇల్లిల్లూ చొచ్చి కొల్లెలాడిన కోడెకాడు
ఎల్లయినా వేంకటేశుడు ఇదే తొల్లిటి దొంగ వచ్చే దోబూచి

నటనల భ్రమయకు నా మనసా ఘటియించు

నటనల భ్రమయకు నా మనసా ఘటియించు హరియే కలవాడు

ముంచిన జగమిది మోహినీ గజము పొంచిన యాస పుట్టించేది
వంచనల నిజము వలనే వుండును మంచులు మాయలె మరునాడు

సరి సంసారము సంతల కూటమి సొరిది బజారము చూపేది
గరిమ నెప్పుడు గలకల మనుచుండును మరులగు విధమే మాపటికి

కందువ దేహముగాని ముదియదిది రూప మాడేదిది
ఎందును శ్రీవేంకటేశ్వరుండును డిందు పడగనిదే తెరమరుగు

Wednesday, August 12, 2009

ఇతడొకడే సర్వేశ్వరుడు సిత కమలాక్షుడు

ఇతడొకడే సర్వేశ్వరుడు సిత కమలాక్షుడు శ్రీ వేంకటేశుడు

పరమ యోగులకు భావ నిధానము అరయ నింద్రాదుల కైశ్వర్యము
గరిమ గొల్లెతల కౌగిట సౌఖ్యము సిరులోసగేటి శ్రీ వేంకటేశుడు

కలికి యశోదకు కన్నా మాణికము తలచిన కరికిని తగు దిక్కు
అల ద్రౌపదికిని ఆపద్బంధుడు చలరేగిన శ్రీ వేంకటేశుడు

తగిలిన మునులకు తపము సత్ఫలము ముగురు వేల్పులకు మూలమీతడే
వొగిసల మేల్మంగ కొసరిన పతియితడు జిగిమించిన ఈసర్వేశుడు

తందనాన ఆహి తందనాన పురే తందనాన భళా

తందనాన ఆహి తందనాన పురే తందనాన భళా తందనాన

బ్రహ్మమొకటే పరబ్రహ్మమోకటే పరబ్రహ్మ మొకటే పరబ్రహ్మమోకటే

కందువగు హీనాధికము లిందు లేవు అందరికి శ్రీహరే అంతరాత్మా
ఇందులో జనుకులమింతా నొకటే అందరికి శ్రీహరే అంతరాత్మ

నిండార రాజు నిద్రించు నిద్రయు నొకటే అండనే బంటు నిద్ర అదియు నొకటే
మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి యొకటే చండాలుడుండేటి సరి భూమి యొకటే

అనుగు దేవతలకును అలకామ సుఖమోకటే ఘన కీట పశువులకు కామ సుఖమోకటే
దిన మహోరాత్రములు తెగి ధనాడ్యున కొకటే వొనర నిరుపేదకును వొక్కటే అవియు

కొరలి శిష్టాన్నములు గొను నాకలోకటే తిరుగు దుష్టాన్నములు తిను నాకలోకటే
పరగ దుర్గంధములపై వాయువోకటే వరుస బరిమళముపై వాయు వొకటే

కడగి ఏనుగు మీద గాయు ఎండోకటే పుడమి శునకము మీద బొలయు నేన్దోకటే
కడు బుణ్యులను బాప కర్ములను సరిగావ జడియు శ్రీ వెంకటేశ్వర నామ మొకటే

పురుషోత్తముడ వీవు పురుషాధముడ నేను

పురుషోత్తముడ వీవు పురుషాధముడ నేను ధరలోన నా యందు మంచి తానమేది

అనంతాపరాధములు అటు నేము సేసేవి అనంతమైన దయ అది నీది
నిను నేరగకుందేటి నీచగుణము నాది నను నెడయకున్దేటి గుణము నీది

సకల యాచకమే సరుసనాకు పని సకల రక్షకత్వము సరి నీ పని
ప్రకటించి నిన్ను దూరేపలుకే నాకేప్పుడూను వెకలి వైనను గాచే విధము నీది

నేరమింతయు నాది నేరు పింతయు నీది సారెకు అజ్ఞాని నేను జ్ఞానివి నీవు
ఈరీతి వేంకటేశ ఇట్టేనను నేలితివి ధారుణిలో నిండెను ప్రతాపము నీది

మరి ఎందూ గతి లేదు మనుప నీవే దిక్కు జరసి

మరి యందు గతి లేదు మనుప నీవే దిక్కు జరసి లక్ష్మిశ నీ శరణమే దిక్కు

జయ జయ నృసింహ సర్వేశ భయహర వీర

జయ జయ నృసింహ సర్వేశ భయ హర వీర ప్రహ్లాద వరద

మిహిర శశినయన మృగనరవేష బహిరంతస్థల పరిపూర్ణ
ఆహి నాయక సింహాసన రాజిత బహుళ గుణ గణ ప్రహ్లాద వరద

చటుల పరాక్రమ సమ ఘన విరహిత నిటుల నేత్ర మౌని ప్రణుత
కుటిల దైత్య తతి కుక్షి విదారణ పటు వజ్ర నఖ ప్రహ్లాద వరద

శ్రీ వనితా సంశ్రిత వామాంక భావజ కోటి ప్రతిమాన
శ్రీ వేంకటగిరి శిఖర నివాస పావన చరిత ప్రహ్లాద వరద

మర్ద మర్ద మామ బంధాని దుర్దాంత మహా

మర్ద మర్ద మామ బంధాని దుర్దాంత మహా దురితాని

చక్రాయుధ రవిశత తేజోంచిత సక్రోధ సహస్ర ప్రముఖ
విక్రమక్రమా విశ్ఫు లింగకన నక్ర హరణ హరి నవ్యకరాంక

కలిత సుదర్శన కటిన విదారణ కులిశ కోటి భావ ఘోషణా
ప్రలయా నల సంభ్రమ విభ్రమ కర రలిత దైత గళ రక్త వికీరణా

హిత కర శ్రీ వేంకటేశ ప్రయుక్త సతత పరాక్రమ జయంకర
చతురోహంతే శరణం గతోస్మి ఇతరాన్ విభజ్య ఇహ మాం రక్షా

శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు

శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీసతి వల్లభ
శరణు రాక్షస గర్వ సంహర శరణు వేంకట నాయక

కమల ధరుడును కమల మిత్రుడు కమల శత్రుడు పుత్రుడు
క్రమముతో మీ కొలువు కిప్పుడు కాచినారేచ్చరికయా

అనిమిషేంద్రులు మునులు దిక్పతులు అమర కిన్నర సిద్ధులు
ఘనతతో రంభాది కాంతలు కాచినారేచరికయా

ఎన్నగల ప్రహ్లాద ముఖ్యులు నిన్ను కొలువగా వచ్చిరి
విన్నపము వినవయ్య తిరుపతి వేంకటాచల నాయక

నానాటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యము

నానాటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యము

పుట్టుటయు నిజము పోవుటయు నిజము నట్టనడిమి పని నాటకము
ఎట్టనెదుట గలదీ ప్రపంచము కట్టకడపటిది కైవల్యము

కుదిచేదన్నాము కొకచుట్టేడిది నడమంత్రపు పని నాటకము
వోడిగట్టు కొనిన వుభయ కర్మములు గడిదాటినపుడే కైవల్యము

తెగదు పాపము తీరదు పుణ్యము నగి నగి కాలము నాటకము
ఎగువనే శ్రీ వేంకటేశ్వరుడేలిక గగనము మీదిది కైవల్యము

Tuesday, August 11, 2009

జయ జయ రామ సమర విజయరామ భవహర

జయ జయ రామ సమర విజయరామ భవహర నిజభక్తి పారీనరామ

జలధి బందించిన సౌమిత్రిరామా సెలవిల్లు విరచిన సీతారామ
అల సుగ్రీవు నేలిన అయోధ్య రామ కలిగి యజ్ఞము గాచే కౌసల్య రామ

అరి రావనాన్తక ఆదిత్య కుల రామ గురు మౌనులను గాచే కోదండ రామ
ధర నహల్య పాలిటి దశరధ రామ హరురాని నుతుల లోకాభిరామ

అతి ప్రతాపముల మాయామృగాంతక రామ నుత కుశలవ ప్రియ సుగుణ రామ
వితత మహిమల శ్రీ వేంకటాద్రి రామ మతి లోన బాయని మనువంశ రామ

భావములోనా బాహ్యమునందును గోవింద

భావములోన బాహ్యమునందున గోవింద గోవింద యని కొలువవో మనసా

హరియవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండములు

హరినామములే అన్ని మంత్రములు హరి హరి హరి హరి హరి యనవో మనసా
విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడెడి వేదంబులు

విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు విష్ణువు విష్ణువని వెదకవో మనసా
అచ్యుతుడితడే ఆదియు నంత్యము అచ్యుతుడే అసురాంతకుడు

అచ్యుతుడు శ్రీవేంకటాద్రి మీద నిదె అచ్యుత అచ్యుత శరణనవో మనసా

నారాయణతే నమో నమో

నారాయణతే నమో నమో నారద సన్నుత నమో నమో

మురహర భవహర ముకుంద మాధవ గరుడగమన పంకజనాభ
పరమ పురుష భవబంధ విమోచన నరమృగ శరీర నమో నమో

జలధి శయన రవిచంద్ర విలోచన జలరుహ భవనుత చరణయుగ
బలిబంధన గోప వధూ వల్లభ నలినోదరతే నమో నమో

ఆదిదేవ సకలాగమ పూజిత యాదవకుల మోహన రూప
వేదోద్చార వేదోద్దర శ్రీ వేంకటనాయక నాద ప్రియతే నమో నమో

డోలాయాం చాల డోలాయాం హరే డోలాయాం

డోలాయాం చాల డోలాయాం హరే డోలాయాం

మీనా కూర్మ వరాహ మృగపతి అవతార దానవారే గుణ శౌరే ధరణీధర మరుజనక

వామన రామ రామ వరకృష్ణ అవతార శ్యామలాంగా రంగ రంగ సామజ వరద మురహరణ

దారుణ బుద్ధ కలికి దశవిధ అవతార శీరపానే గోసమాణే శ్రీవేంకటగిరి కూటనిలయా

శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ

శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ నీ శ్రీ పాదమే శరణు

కమలా sati ముఖకమల కమలహిత కమలప్రియ కమలేక్షణ
కమలాసనహిత గరుడగమన శ్రీ కమలనాభ నీ పదకమలమే శరణు

పరమ యోగిజన భాగధేయ శ్రీ పరమ పూరుష పరాత్పర
పరమాత్మ పరమాణు రూప శ్రీ తిరువేంకటగిరి దేవ శరణు

నల్లని మేని నగవు చూపుల వాడు

నల్లని మేని నగవు చూపుల వాడు తెల్లని కన్నుల దేవుడు

బిరుసైన దనుజుల పించమనచినట్టి తిరుపు కైదువ తోడి దేవుడు
సరిపడ్డ జగమెల్ల చక్కచ్చాయకు దెచ్చి తెరవు చూపినట్టి దేవుడు

నీత గలసినట్టి నిండిన చదువులు తేట పరచినట్టి దేవుడు
పాటి మాలి నట్టి ప్రాణుల దురితపు తీట రాసినట్టి దేవుడు

గురుతు వేట్టగారాని గుణముల నెలకొన్న తిరువేంకటాద్రిపై దేవుడు
తిరముగ ధ్రువునికి దివ్యపదంబిచ్చి తెరచి రాజన్నట్టి దేవుడు

Monday, August 10, 2009

అన్ని మంత్రములు నిండే యావహించెను

అన్ని మంత్రములు నిందే యావహించెను వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము

నారదుడు జపియించే నారాయణ మంత్రము చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము
కోరి విభీషణుడు చేకొనే రామ మంత్రము వేరే నాకు గలిగే వెంకటేశు మంత్రము

రంగగు వాసుదేవ మంత్రము ద్రువుండు జపించే సంగవించే కృష్ణ మంత్రము అర్జునుడును
ముంగిట విష్ణు మంత్రము మొగి శుకుడు పటియించే వింగడమై నాకు నబ్బె వెంకటేశు మంత్రము

ఇన్ని మంత్రముల కెల్ల ఇందిరానాదుడే గురి పన్నిన దిదియే పరబ్రహ్మ మంత్రము
నన్ను గావ గలిగేబో నాకు గురుడియ్యగాను వెన్నెల వంటిది శ్రీ వెంకటేశు మంత్రము

జయ మంగళము నీకు సర్వేశ్వర

జయ మంగళము నీకు సర్వేశ్వర జయ మంగళము నీకు జలజవాసినికి

శరణాగత పారిజాతమా పొరి నసురలపాలి భూతమా
అరుదైన సృష్టికి నాది మూలమావో హరి నమో పరమపుటాల వాలామా

సకల దేవతా చక్రవర్తి వెకలి పై నిండిన విశ్వముర్తి
అకలన్కమైన దయానిధి వికచముఖ నమో విధికి విధి

కొలిచిన వారల కొంగు పైడి ములిగిన వారికి మొనవాడి
కలిగిన శ్రీ వెంకటరాయా మలసి దాసుల మైన మాకు విధేయా

ఉయ్యాల ఊపులు ఓ ముద్దులయ్య

ఉయ్యాల ఊపులు ఓ ముద్దులయ్య వెయ్యారు గోపికలు వేడుక నూచెదరు

భోగింద్రతల్పుడా భువన విఖ్యాతా గోగోప రక్షకా కువలయాధీశా
ఆగమ సన్నుతా అచ్యుతానందా యోగనిద్ర పోవయ్యా యోగింద్రవంద్యా

దేసలందు వెలిగేటి దేవర్షివరులు ప్రసరించి బంగారు భవనంబు లోన
కొసరక నిద్రించు గోగిందాయనుచు పసమీర పాడెదరు పన్నగ శయనా

సన్నుతించెదరయ్య సద్భాగవతులు పన్నుగ శ్రీ భూమి వనితలు చేరి
ఉన్నతి పదములను వత్తెదరు నిద్రించు వెన్నుడా ప్రసన్న వెంకటరమణా

ఈతడే రఘురాము దీతదేకాంగ వీరుడు ఈతడు

ఈతడే రఘురాముదీతదేకాంగ వీరుడు ఈతడు చేసిన చేత లెన్ని యైనా కలవు

ఖరదూశానాడులను ఖండ తుండముల సేసే అరుదుగా వాలి నొక్క యమ్మున నేసె
సరవి కొండల చేత సముద్రము బంధించే ఇరవై విభీశానునికిచ్చే లంకా రాజ్యము

కూడపెట్టె వానరుల కుమ్భాకర్నాదిడైత్యుల తోడనే రావణు జంపె దురము గెల్చే
వేడుకతో సీత దేవి కూడెను పుష్పకమేక్కే ఈడు జోడై సింహాసన మేలే నయోధ్యలోన

పుడమి యంతయు గాచే పొందుగా తనంత లేసి కొడుకుల గాంచెను కుశలవుల
యెడయక శ్రీవేంకటేశుడై వరము లిచ్చే అడరి తారక బ్రహ్మమై ఇదే వెలసె

అపరాధిని నే నైనాను కృపగలవారికి

అపరాధిని నే నైనాను కృపగలవారికి గపటము లేదు

సనాతనా అచ్యుత సర్వేశ్వరా అనాదికారణ అనంతా
జనార్దనా అచల సకల లోకేశ్వరా నిను మరచి యున్నాడ నను దేలువవయా

పురాణ పురుషా పురుషోత్తమా చరాచరాత్మక జగదీశ
పరాత్పరా హరి బ్రహ్మండనాయకా ఇరవు నీవేయట ఎరిగించగవే

దేవోత్తమా శశి దినకరనయనా పావన చరితా పరమాత్మా
శ్రీ వేంకటేశ జీవాంతరంగా సేవకుడను బుద్ధి చెప్పగవలయు

ఉదయాద్రి తెలుపాయె నుండు రాజు కొలువీడే

ఉదయాద్రి తెలుపాయె నుండు రాజు కోలు వీడే అడ నెరిగి రాదాయే నమ్మ నా విభుడు

చన్నులపై ముత్యాల సరు లెల్ల జల్లనాయే కన్నులకు గప్పొదవె గాంత నాకిపుడు
కనె కలువల జాతి కను మొడ్చినది మీద వెన్నెల వేసంగి మొగ్గ వికసించే గదవే

పువ్వుల లోపలి కురులు బుగులు కొనగా నేరసే దవ్వుల దుమ్మెదగములు తరమి డాయగను
రవ్వ సేయ శుక పికము రాయడి కోర్వగా రాదు అవ్వల నెవ్వతె పసల కలరున్న వాడో

పన్నీట జలక మార్చి పచ్చ కప్రము మేతి చెన్ను గంగొప్పున విరులు చెరువందురిమి
ఎన్నంగల తిరువేంకటేశుం డిదె ననుంగూడి కన్నుల మనసునుందనియం గరుణించెం గదవే

ఇహ పర సాధన మీ తలపు సహజ జ్ఞానికి

ఇహ పర సాధన మీ తలపు సహజ జ్ఞానికి సత మీ తలపు

సిరులు ముంగితను జిగి దడ బడగా హరిని మరపనిది యది దలపు
సరిగాంత లేదుట సందడి గొనగా తిరమయి భ్రమయనిదే తలపు

వొడలి వయోమదముప్పతిల్లినను అడచి మెలంగుట యది దలపు
కడగుచు సుఖ దుఃఖములు ముంచినను జడియై నామస్మరణమే తలపు

మతి సంసారపు మాయ గప్పినను అతి కాంక్ష జారని దది తలపు
గతియై శ్రీవేంకటపతి గాచిన సతతము నితని శరణమే తలపు

ఎంత కాలమో కదా ఈ దేహ ధారణము చింతా

ఎంత కాలమో కదా ఈ దేహ ధారణము చింతా పరంపరల జిక్కువడవలసె

వడిగొన్న మోహంబువలల దగులై కదా కడ లేని గర్భ నరకము లీదవలసే
నడిమి సుఖముల చేత ననువు సేయగా గదా తొడరి హేయప్ దిద్ది దూరాడవలసె

పాప పున్జముల చే బట్టు వడగా గదా ఆపదల తోడి దేహము మోప వలసె
చూపులకు లోనైన సుఖము గానక కదా దీపన భ్రాంతి చే దిరిగాడవలసే

హితుడైన తిరు వెంకటేశు గొలువక కదా ప్రతిలేని నరక కూపమున బడ వలసె
ఆతని కరుణారసం బబ్బకుండగా గదా బతిమాలి నలుగ డల బారాడ వలసె

అన్ని విభవముల అతడితడు కన్నులు వేవేలు

అన్ని విభవముల అతడితడు కన్నులు వేవేలు గల ఘనుడు

వేదాంత కోటుల విభుడు ఇతడు నాద బ్రహ్మపు నడు మితడు
ఆది యంత్యముల కరుదితడు దేవుడు సరసిజ నాభుడు ఇతడు

భావములనచు యదుపతి ఇతడు భువనము లన్నిటికీ పొడ వితడు
దివికి దివమైన తిరమితడు పవనసుతు నేలిన పతి ఇతడు

గరుడుని మీదటి ఘనుడితడు సిరులందరి కిచ్చే చెలు వితడు
తిరువేంకట నగము దేవు డితడు పరమ పదమునకు ప్రభు వితడు

అమరె గాదె నేడు అన్ని సొబగులును

అమరె గాదె నేడు అన్ని సొబగులును సమరతి చిన్నలు సతి నీ మేన

చెలపల చెమటలు చెక్కిళ్ళ మొలకల నవ్వులు మొక్కిళ్ళ
సొలపుల వేడుక చొక్కిళ్ళ తొలగని యాసలు తొక్కిళ్ళ

నెరవగు చూపులు నిక్కిళ్ళ మెరసెను తమకము మిక్కిళ్ళ
గురుతగు నధరము గుక్కిళ్ళ తరచగు వలపుల దక్కిళ్ళ

ననుగోరి కొనలు నొక్కిళ్ళ పొనుగని తములము పుక్కిళ్ళ
ఘనుడగు శ్రీవేంకటపతి కౌగిట ఎనసెను పంతము వెక్కిళ్ళ

అలుకలు చెల్లవు హరి పురుషోత్తమ

అలుకలు చెల్లవు హరి పురుషోత్తమ నలి నిందిరా నీతో నవ్వినది

ఆదిలక్ష్మి మోహన కమలంబున వేద మాట నిన్ను వేసినది
అదెస నీపై నభయ హస్తమును సాదరముగా గడు జూచినది

సిరి దన కన్నుల చిన్తామనులను పోరి నీపై దిగ బోసినది
వరద హస్తమున వలచెయి పట్టుక అరుదుగా నిను మాటాడించినది

జలధి కన్య తన సర్వాంగంబుల బిలిచి నిన్ను నిటు పెనగినది
అలముక శ్రీవేంకటాధిప నిను రతి నెలమి నీ వురంబెక్కినది

ఎక్కువ కులజుడైన హీన కులజుడైన

ఎక్కువ కులజుడైన హీన కులజుడైన నిక్క మెరిగిన మహా నిత్యుడే ఘనుడు

వేదములు చదివియు విముఖుడై హరి భక్తి యాదరించలేని సోమయాజికంటె
ఏదియును లేని కుల హీనుడైనను విష్ణు పాదములు సేవించు భక్తుడే ఘనుడు

పరమమగు వేదాంత పఠన దొరికియు సదా హరి భక్తి లేని సన్యాసి కంటే
సరవి మాలిన యంత్య జాతి కులజుడైన నరసి విష్ణు వెదుకు నాతడే ఘనుడు

వినియు జదివియును శ్రీవిభుని దాసుడు గాక తనువు వేపుచునుండు తపసి కంటే
ఎనలేని తిరువేంకటేశు ప్రసాదాన్న మనుభవించిన యాతడప్పుడే ఘనుడు

Saturday, August 8, 2009

అంగన లిరే హారతులు అంగజగురునకు

అంగన లీరె హారతులు అంగజగురునకు నారతులు

శ్రీదేవి తోడుత జెలగుచు నవ్వే ఆదిమ పురుషుని కారతులు
మేదినీ రమణి మేలము లాడేటి ఆదిత్య తేజున కారతులు

సురలకు నమృతము సొరది నొసంగిన హరి కివో పసిడారతులు
తరమిది దుష్టుల దనుజుల నడచిన అరి భయంకరున కారతులు

నిచ్చలు కళ్యాణ నిధియై యేగేటి అచ్యుతునకు నివే యారతులు
చొచ్చి శ్రీ వేంకటేశుడు నలమేల్మంగ యచ్చుగ నిలిచిరి యారతులు

ఎంత మాత్రమున నెవ్వరు దలచిన అంత మాత్రమే నీవు

ఎంత మాత్రమున నెవ్వరు దలచిన అంత మాత్రమే నీవు
అంతరాంతరములెంచి చూడ పిండంతే నిప్పటి యన్నట్లు

కొలుతురు మిము వైష్ణవులు కూరిమితో విష్ణుడని
పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మంబనుచు
తలతురు మిము శైవులు తగిన భక్తులను శివుడనుచు
అలరి పొగడుదురు కాపాలికులు ఆది భైరవుడవనుచు

సరి నెన్నుదురు శాక్తేయులు శక్తి రూపు నీ వనుచు
దరిశనములు మిము నానా విధులను తలపుల కొలదుల భజింతురు
సిరుల మిమ్మునే యల్ప బుద్ధి దలచిన వారికి నల్పంబవుదువు
గరిమల మిమ్మునే ఘనమని తలచిన ఘన బుద్ధులకు ఘనుడవు

నీ వలన గోరతే లేదు మరి నీరు కొలది తామెరవు
ఆవల భాగీరధి దరి బావుల ఆజలమే వూరినట్లు
శ్రీ వేంకటపతి నీవైతే మము జేకొని వున్నదైవమని
యీవలనే నీ శరణని ఎదను ఇదియే పరతత్వము నాకు

ఇట్టి ముద్దు లాడి బాలుడేడవాడు వాని

ఇట్టి ముద్దు లాడి బాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు వోయరే

కామిడి పారిదెంచి కాగెడి వెన్న లోన చేమ పూవు కడియాల చేయి పెట్టి
చీమ గుట్టేనానని చక్కిట కన్నీరు జార వేమరు వాపోయె వాని వెడ్డు వెట్టరే

ముచ్చు వలె వచ్చి తన ముంగిట మురువుల చేయి తచ్చెడి పెరుగు లోన తగ వెట్టి
నొచ్చెనని చేయి దీసి నోరి నెల్ల జొల్లు గార వొచ్చెలి వాపోవు వాని నూరడించరే

ఎప్పుడు వచ్చెనో మా ఇల్లు జొచ్చి పెట్టె లోని చెప్పరాని వుంగరాల చేయి పెట్టి
అప్పడైన వేంకటేశుడా సపాలకుడు గాన తప్పకుండ బెట్టె వాని తల కేత్తరే

Friday, August 7, 2009

అలర చంచలమైన ఆత్మలందుండ

అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసే నీ వుయ్యాల
పలుమారు నుచ్చ్వాస పవనమందుండ నీ భవంబు దేలిపే నీ వుయ్యాల

వుదాయాస్తాశైలంబు లోనర కంభములైన వుడు మండలము మోచె నుయ్య్హాల
అదన ఆకాశ పదము అడ్డౌ దూలంబైన అఖిలంబు నిండే నీ వుయ్యాల

పదిలముగా వేదములు బంగారు చేరులై పట్టి వెరపై తోచే వుయ్యాల
వదలకిటు ధర్మ దేవత పీఠమై మిగుల వర్ణింప నరుదాయె వుయ్యాల

మేలు కట్లై మీకు మేఘమండలమెల్ల మెరుగునకు మెరుగాయె వుయ్యాల
నీల శైలము వంటి నీ మేని కాంతికి నిజమైన తోడవాయే వుయ్యాల

పాలిండ్లు కదలగా పయ్యేదలు రాపాడ భామినులు వడినూచు వుయ్యాల
వొలి బ్రహ్మాండములు వోరగువోయని భీతి నొయ్య నొయ్య నైరి వూచిరుయ్యాల

కమలకును భూపతికి కదలు కదలకు మిమ్ము కౌగలిన్పగజేసే నుయ్యాల
అమరాంగనలకు నీ హాస భావ విలాస మందంద చూపే నీ వుయ్యాల

కమలాసనాదులకు కన్నుల పండుగై గణుతింప నరుదాయె వుయ్యాల
కమనీయ మూర్తి వేంకశైలపతి నీకు కడు వేడుకై వుండే వుయ్యాల

అంతర్యామి అలసితి ఇంతట

అంతర్యామి అలసితి ఇంతట నీ శరణిదే జొచ్చితిని
కోరిన కోర్కులు కోయని కట్లు తీరవు నీవవి తెంచక
భారపు బగ్గాలు పాప పుణ్యములు నేరుపుల బోనీవు నీవు వద్దనక
జనుల సంగముల జక్క రోగములు విను విడువవు నీవు విడిపించక
వినయపు దైన్యము విడువని కర్మము చనదది నీ విటు శాంతపరచక
మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వద్దనక
ఎదుటనే శ్రీ వెంకటేశ్వర నీ వదె అదనగాచితివి అట్టిట్టనక

ఏముకో చిగురుటధరమున

ఏమొకో చిగురుటధరమున ఎడ నెడ కస్తూరి నిండెను భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా

కలికి చకోరాక్షికి కడ కన్నుల కేంపై తోచిన చెలువంబిప్పుడిదేమో చిన్తెమ్పరే చెలులు
సలుపున ప్రానేస్వరుపై నాటిన యాకోన చూపులు నిలువున పెరుకగ నంటిన నెత్తురు కాదు కదా

పడతికి చనుగవ మెరుగులు పై పై పయ్యెద వెలుపల కడు మించిన విధమేమో కనుగొనరే చెలులు
వుడుగని వేడుకతో ప్రియుడొత్తిన నఖ శశి రేఖలు వెదాలగా వేసవి కాలపు వెన్నెల కాదు కదా

ముద్దియ చెక్కుల కెలకుల ముత్యపు జల్లుల చేర్పుల వొద్దికలాగులివేమో ఊహింపరే chelulu
గద్దరి తిరు వేంకటపతి కౌగిట యధరామ్రుతముల అద్దిన సురతపు చెమటల అందము కాదు కదా

Thursday, August 6, 2009

పసిడియక్షింతలివే పట్టరో వేగమే రారారో

పసిడి యక్షింతలివే పట్టరో వేగమే రారారో దెసల పేరంటాండ్లు దేవుని పెండ్ల్కిని

శ్రీ వెంకటేశ్వరునికి శ్రీ మహాలక్ష్మికి దైవికపు పెండ్లి ముహూర్తము నేడు
కావించి భేరులు మ్రోసె గరుడ ధ్వజంబెక్కే దేవతలు రారో దేవుని పెండ్లికిని

కందర్ప జనకునికి కమలాదేవికి పెండ్లి పందిలి లోపల తలంబాలు నేడు
గంధమూ వీడే మిచ్చేరు కలుపడాలు గట్టిరి అందుక మునులు రారో హరి పెండ్లికిని

అదే శ్రీ వేంకటపతికి అలమేలు మంగకును మొదలి తిరుఆల్లకు తిరునాళ్ళకు మ్రొక్కేము నేడు
ఎదుట నేగేరు వీరే ఇచ్చేరు వరము లివె కదలి రారో పురుష ఘనులు పెండ్లికిని

సేవించరో జనులాల చేతులెత్తి మొక్కరో

సేవించరో జనులాల చేతులెత్తి మొక్కరో వావిరి ప్రహ్లాదునికి వరదుడు వీడే

జగన్నాధుడు వీడే సర్వ రక్షకుడు వీడే నిగమ వేద్యుడైన నిత్యుడు వీడే
సుగుణ వంతుడు వీడే సర్వ కాముడు వీడే నగు మొగము సుగ్రీవ నరసింహుడు వీడే

మరు జనకుడు వీడే మహిమాధికుడు వీడే పరగ శ్రీలక్ష్మి పతియు వీడే
సురులకేలిక వీడే శుభ మూరుతి వీడే నరసఖుడు సుగ్రీవనరసిహుడు వీడే

భువనాధిపతి వీడే పురుషోత్తముడు వీడే వివిధ ప్రతాప కోవిదుడు వీడే
ఈవల శ్రీ వేంకటాద్రి నిరవైనతదు వీడే నవమూర్తి సుగ్రీవ నరసింహుడు వీడే

చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు జాలెల్ల

చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు జాలెల్ల నడగించు సంకీర్తనం

సంతోష కరమైన సంకీర్తనం సంతాప మణగించు సంకీర్తనం
జంతువుల రక్షించు సంకీర్తనం సంతతము దలచుడీ సంకీర్తనం

సామజము గాంచినది సంకీర్తనం సామమున కెక్కుడీ సంకీర్తనం
సామీప్య మిందరికి సంకీర్తనం సామాన్య మా విష్ణు సంకీర్తనం

జాము బారి విడిపించు సంకీర్తనం సమ బుద్ధి వొడ మించు సంకీర్తనం
జమళి సౌఖ్యము లిచ్చు సంకీర్తనం శమదమాదుల జేయు సంకీర్తనం

జలజాసనుని నోరి సంకీర్తనం చలిగొండ సుతదలచు సంకీర్తనం
చలవ గడు నాలుక కు సకీర్తనం చలపట్టి తలచుడీ సంకీర్తనం

సరవి సంపద లిచ్చు సంకీర్తనం సరి లేని దిదియ పో సంకీర్తనం
సరుస వేంకట విభుని సంకీర్తనం సరుసగను దలచుడీ సంకీర్తనం

కొలువై వున్నాడు వేదే గోవింద రాజు

కొలువై వున్నాడు వీడే గోవింద రాజు కొలకోల నేగి వచ్చే గోవింద రాజు

గొడుగుల నీడల గోవింద రాజు గుడి గొన్న పడగల గోవింద రాజు
కుడి ఎడమ కాంతల గోవింద రాజు కొడి సాగే పవుజుల గోవింద రాజు

గొప్ప గొప్ప పూదండల గోవింద రాజు గుప్పేటి వింజామరల గోవింద రాజు
కొప్పు పై చుంగుల తోడి గోవింద రాజు కుప్పి కటారము తోడి గోవింద రాజు

గొరబుసింగరాల గోవింద రాజు కురులు దువ్వించుకొని గోవింద రాజు
తిరుపతి లోనను తిరమై శ్రీ వెంకటాద్రి గురిసీ వరము లెల్ల గోవింద రాజు

కొలిచిన వారల కొంగు పైడితడు పైదితాడు బలిమి తారక

కొలిచిన వారల కొంగు పైడితడు బలిమి తారక బ్రహ్మమీతడు

ఇన వంశాంబుధి నెగసిన తేజము ఘన యజ్ఞంబుల గల ఫలము
మనుజ రూపమున మనియెడి బ్రహ్మము నినువుల రఘుకుల నిధాన మీతడు

పరమాన్నము లోపలి సారపుజవి పరగినది విజుల భయ హరము
మరిగిన సీతా మంగళ సూత్రము ధరలో రామావతారంబితడు

చకిత దానవుల సంహారచక్రము సకల వనచరుల జయకరము
వికసితమగు శ్రీ వేంకట నిలయము ప్రకటిత దశరధ భాగ్యంబితడు

కంటి నఖిలాండ తతి కర్త నధికుని గంటి

కంటి నఖిలాండ తతి కర్త నధికుని గంటి కంటి నఘములు వీడు కొంటి నిజ మూర్తి గంటి

మహనీయ ఘన ఫనామనుల శైలము గంటి బహు విభవముల మంటపములు గంటి
సహజ నవరత్న కాంచన వేదికలు గంటి రహి వహించిన గోపురములవె గంటి

పావనంబైన పాపవినాశము గంటి కైవశంబగు గగన గంగ గంటి
దైవికపు పుణ్య తీర్ధము లెల్ల బొడగంటి కోవిదులు గొనియాడు కోనేరి గంటి

పరమ యోగింద్రులకు భావ గోచరమైన సరి లేని పాదాంబుజముల గంటి
తిరమైనగిరి చూపు దివ్య హస్తము గంటి తిరు వేంకటాచలాధిపు జూడగంటి

కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు

కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు కొండలంత వరములు గుప్పెడు వాడు

కుమ్మర దాసుడైన కురువరతి నంబి ఇమ్మన్న వారము లెల్ల నిచ్చిన వాడు
దొమ్ములు సేసినయట్టి తొండమాం చక్కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మిన వాడు

అచ్చపు వేడుక తోడ ననంతాలువారికి ముచ్చిలి వెర్రికి మన్ను మోచిన వాడు
మచ్చిక దొలక దిరుమల నంబి తోడుత నిచ్చ నిచ్చ మాట లాడి నొచ్చిన వాడు

కంచి లోన నుండ దిరు కచ్చి నంబి మీద కరుణించి తన యెడకు రప్పించిన వాడు
ఎంచి ఎక్కుడైన వేంకటేశుడు మనలకు మంచి వాడి కరుణ బాలించిన వాడు

ఫాల నేత్రానల ప్రబల విద్యుల్లతా

ఫాల నేత్రానల ప్రబల విద్యుల్లతా కేళి విహార లక్ష్మీ నారసింహా

ప్రళయ మారుత ఘొర భస్త్రీకా పూత్కార లలిత నిశ్వాస డోల రచనయా
కూలశైల కుమ్భినీ కుముదహిత రవిగగన చలన విధినిపుణ నిశ్చల నారసింహా

వివరఘనవదన దుర్విధహసన నిష్ట్యుత లవదివ్య పరుష లాలాఘటనయా
వివిధ జంతు వ్రాతభువన మగ్నౌకరణ నవనవ ప్రియ గుణార్ణవ నారసింహా

దారునోజ్వల ధగధగిత దంష్ట్రనలవి కారష్పులింగా సంగక్రీడయా
వైరి దానవ ఘోర వంశ భస్మీ కరణ కారణ ప్రకట వెంకట నారసింహా

కదిరి నృసింహుడు కంభమున వెడలె

కదిరి నృసింహుడు కంభమున వెడలె విదితముగా సేవించరో మునులు

ఫాలలోచనము భయ ద్రోగముఖము జ్వాల మయ కేసరములను
కాల రౌద్ర సంఘటిత దంతములు హేలాగతి ధరిఇంచుక నిలిచె

ముడివడు బొమ్మలు ముంచినవూర్పులు గడ గడ నదరెతి కటములను
నిదుదనాలికేయు నిక్కు గర్ణములు నడియాల పురూపైతావేలసే

సకలాయుధములు సహస్ర భుజములు వికటనఖంబులు వెసఁ బూని
వెకలియగుచు శ్రీ వేంకటేశ్వరుడే ప్రకటపు దుష్టుల భజించే నిదివో

ముద్దుగారే యశోద ముంగిట

ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు తిద్దరాని మహిమల దేవకీ సుతుడు

అంత నింత గొల్లెతల అరచేతి మాణిక్యము పంత మాడే కంసుని పాలి వజ్రము
కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు

రాతి కేళి రుక్మిణికి రంగు మోవి పగడము మితి గోవర్ధనపు గోమేధికము
సతమై శంఖ చక్రాల సందుల వైడూర్యము గతియై మమ్ము గాచేటి కమలాక్షుడు

కాళింగుని తలలపై కప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీవేంకటాద్రి ఇంద్ర నీలము
పాలజల నిధి లోని పాయని దివ్యరత్నము బాలుని వలె తిరిగి పద్మ నాభుడు

చక్రమా హరిచక్రమా

చక్రమా హరిచక్రమా వక్రమైన దనుజుల వక్కలించవో
చుట్టి చుట్టి పాతాళము చొచ్చి హిరణ్యాక్షుని చట్టలు చీరిన వో చక్రమా

పానుకొని దనుజలబలు కిరీటమనుల సానలదీరిన వో చక్రమా
నానా జీవముల ప్రాణములు గాచి ధర్మ మూని నిలుపగదవో వో చక్రమా

వెరచి బ్రహ్మాదులు వేదమంత్రములని పురట్లు గొనియాడే రో చక్రమా
అరిమురి దిరు వెంకతాద్రీషు వీధుల వొరవుల మెరయుదువో వో చక్రమా

మంగాంబుధి హనుమంత నీ శరణు

మంగాంబుధి హనుమంత నీ శరణు మంగవించితిమి హనుమంతా

బాలార్క బింబము ఫలమని పట్టిన అలరిచేతల హనుమంతా
తూలని బ్రహ్మాదులచే వరములు వోలిజెకొనిన వో హనుమంతా

జలధి దాట నీ సత్వము కవులకు నలరి దేలిపితివి హనుమంతా
ఇలయు నాకసము నేకముగా నటు బలిమి బెరిగితివి భళి హునుమంత

పాతాళము లోపలి మై రావణు నాతల జంపిన హనుమంతా
చేతులు మోడ్చుక శ్రీవేంకటపతి నీ తల గొలిచే హిత హనుమంతా

Friday, July 31, 2009

ఈడగు పెండ్లి ఇద్దరి చేసేము

ఈడగు పెండ్లి ఇద్దరి చేసేము చేడెలాల ఇది చెప్పారుగా

పచ్చిక బయళ్ళ పడతి అడగ ముచ్చట కృష్ణుడు మోహించి
వెచ్చపు పూదండ వేసి వచ్చెనట గచ్చుల నాతని కానరుగా

మైపు ముంగిట ముదిత నడువగ ఉత్తముడే చెలి పురమునను
చిత్తరవు వ్రాసి చెలగి వచ్చే నొక జొత్తు మాని ఇటు జూపరుగా

కొత్త అవికేలో కొమ్మ నిలిచితే పొత్తున తలబాలు వోసెనట
ఇత్తల శ్రీ వేంకటేశుడు నవ్వుచు హత్తి సతి గూడె నని పాడరుగా

పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు

పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పడమరలి నవ్వీనే పెండ్లి కూతురు

పేరు కల జవరాలె పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మేడ పెండ్లి కూతురు
పెరంతాడ్ల నడిమి పెండ్లి కుత్చురు విభు పేరు కుచ్చు సిగ్గుపడీ బెండ్లి కూతురు

బిరుదు పెండము వెట్టె బెండ్లి కూతురు నేర బిరుదు మగని కంటే బెండ్లి కూతురు
పిరి దూరి నప్పుడే పెండ్లి కూతురూ పతి బేర రేచీ నిదివో పెండ్లి కూతురు

పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడే పెట్టెడు చీరలు గట్టి పెండ్లి కూతురు
గట్టిగ వేంకటపతి కౌగిటను పెట్టిన నిధానమైన పెండ్లి కూతురు

సింగార మూరితివి చిత్తజు

సింగార మూరితివి చిత్తజు గురుడవు చక్కగా జూచేరు మిము సాసముఖా

పూవుల తెప్పల మీద పొలతులు నీవు నెక్కి పూవులు ఆకసము మోప పూచిచల్లుచు
దేవ దుందుభులు మ్రోయ దేవతలు కొలువగా సావధానమగు నీకు సాసముఖా

అంగరంగ వైభవాల అమరకామినులాడ నింగి నుండి దేవతలు నినుజూడగా
సంగీత తాలవాద్య చతురతలు మెరయ సంగడి దేలేటి నీకు సాసముఖా

పరగ కోనేటి లోన పసిడి మేడ నుండి అరిది ఇందిరయు నీవు ఆరగించి
గరిమ శ్రీవేంకటేశ కన్నుల పండువ కాగ సరవినోలాడు సాసముఖా

Thursday, July 30, 2009

ఇందిర వడ్డించ నిమ్పుగను

ఇందిర వడ్డించ నిమ్పుగను చిన్డక ఇట్లే భుజించవో స్వామి

akkaala పాలాలు నప్పాలు వడలు పెక్కైన సైదమ్పు పెణులును
సక్కేరరాసులు సద్యోఘ్రుతములు కిక్కిరియ నారగించావో స్వామి

మీరిన కేలంగు మిరియపు దాలింపు గుఉరాలు కమ్మని కుఉరలును
సారంపుబచ్చాల్లు చవులు గనిట్టే కూరిమితో జేకోనవో స్వామి

పిండివంటలను బెరుగులు బాలు మెండైన పాశాలు మెచ్చి మెచ్చే
కొండలపొడవు కూరి దివ్యన్నాలు వెండియు మెచ్చావే వెంకటస్వామి

కంటి శుక్రవారము


కంటి శుక్రవారము గడియ లేడింట అంటి అలమేల్మంగా అండ నుండే స్వామిని
సొమ్ములన్నీ కడపెట్టి సొంపుతో గోణము గట్టి కమ్మని కదంబము కప్పు కన్నీరు
చేమ్మతోను వేస్టువలు రొమ్ము తల మొలజుట్టి తుమ్మెద మైచాయ తోన నేమ్మదినుండే స్వామిని

పచ్చ కప్పురమే నూరి పసిడి గిన్నేలనించి తేచిః శిరసాదిగ దిగనలది
అచ్చెరపడి చూడ నందరి కనులకింపై నిచ్చ నిచామల్లెపూవువలె నిటుతానుండే స్వామిని

తట్టుపునుగే కురిచి చట్టలు చేరిచినిప్పు పట్టి కరిగించు వెండి పల్లాలనించి
దట్టముగా మేను నిండపట్టించి దిద్ది బిట్టు వెడుకమురియు చుండే బిత్తరి స్వామిని

చూడ జూడ మాణిక్యాలు చుక్కల

చూడ జూడ మాణిక్యాలు చుక్కల వలె నున్నవి యీడు లేని కన్ను లెన్నుల వేయిన చంద్రులు

కంటి గంటి వాడె వాడె ఘనమైన ముత్యాల కంటమాలలవే పదకములు నవే
మింతిపోదవైనట్టి ;మించు గిరీతం బడే జంటల వెలుగు సంఖ చక్రలవే

మొక్కు మొక్కు వాడె వ అదే ముందరనే వున్నాడు చెక్కులవే నగవుతో జిగిమోమడే
పుక్కిట లోకములవే భుజకీర్తులును నవే చక్కనమ్మ అలమేలు జవరాలాడే

ముంగైములాలును నవే మొల కతరును నాడే బంగారు నిగ్గులవాన్నే పచ బత్తడే
ఇంగితమేరిగే వెంకతెసుడిదే కన్నులకు ముంగిట నిదానమైన మూలా భూత మాదే

నిత్య పూజలివివో

నిత్య పూజలివివో నెరిచిన నోహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి

తనువే గుడియట తలయె శిఖరమట పెను హృదయమే హరి పీతమాట
కనుగొన చూపులే ఘన దీపములట తనలోపాలి యన్తర్యమికి

పలౌకే మంత్రమట పాడిన నాలుకే కలకలమను పిడి ఘటమట
నలువైన రుచులే నైవేద్యములట తలపులోపలనున్న దైవమునకు

గమన చేష్టలే యన్గరన్గ గతి యట తమిగల జీవుడే దాసుడటా
అమరిన వూర్పులే యాలపత్తములత క్రమముతో శ్రీ వెంకటరాయనికి

Wednesday, July 29, 2009

విన్నపాలు వినవలె వింతవింతలు

విన్నపాలు వినవలె వింత వింతలు పన్నగపు దోమతెర పై ఎత వేలయ్య

తెల్లవారే జామెక్కె దేవతలు మునులు అల్లా నల్ల నంత నింత నదిగోవారే
చల్లని తమ్మిరేకుల సారసపు గన్నులు మేల్లమేల్లనేవిచి మేల్కొనవేలయ్య

గరుడ కిన్నెర యక్ష కామినులు గములై విరహపు గీతముల వింతాలాపాల
పరిపరి విధముల పాడేరు నిన్నదివో సిరి మొగము దెరచి చిత్తగించవేలయ్య

పొంకపు శేషాదులు తుంబూరు నరాదడులు పంకజ భవాదులు నీ పదాలు చేరి
అన్కేలున్నారు లేచి అలమేలు మంగను వెంకటేశుడా రెప్పలు విచి హుచి లేవయ్యా

Tuesday, May 19, 2009

వలపుల సొలపుల వసంత వేళ ఇది

వలపుల సొలపుల వసంత వేళ ఇది
సెలవి నవ్వకువే, చెమరించీ మేను

శిరసు వంచకువే సిగ్గులు వడకువే
పరగ నిన్నతడూ తప్పక జూచేని
విరులు దులుపకువే వెసఁ దప్పించుకోకువే
సిరులనీ విభుడిట్టే సేసవేట్టీనీ

చెయ్యెత్తి యోడ్డుకొకువే చేరి యాన పెట్టకువే
చాయల నాతడు నీ చన్నులంటీని
ఆయములు దాచకువే అట్టే వెరగందకువే
మోయనాడి సరసము మోహన నీ విభుడు

పెనగులాడకువే బిగువు చూపకువే
ఘన శ్రీ వేంకటేశుడు కౌగిలించీని
అనుమానించకువే అలమేలు మంగవు నీవు
చనవిచ్చి నిన్ను నేలే సమ్మతించీ ఆతడు

అయమేవ అయమేవ ఆదిపురుషో

అయమేవ అయమేవ ఆదిపురుషో
జయకరం తమహం శరణం భజామి

అయమేవ ఖలు పురా అవనీధరస్తు సో
ప్యయమేవ వట దళాగ్రాది శయనః
అయమేవ దశ విధైరవతార రూపస్య
నయ మార్గ భువి రక్షణం కరోతి

అయమేవ సతతం శ్రియః పతిర్దేవేషు
అయమేవ దుష్ట దైత్యాంతకస్తూ
అయమేవ సకల భూతాంతరేషు ఆక్రమ్య
ప్రియ భక్త పోషణం ప్రీత్యా తనోతి

అయమేవ శ్రీ వెంకటాద్రౌ విరాజతే
అయమేవ వరదోపి యాచకానాం
అయమేవ వేద వేదాంతైశ్చ సూచితో
అయమేవ వైకుంఠ అధీశ్వరస్తూ

Tuesday, May 12, 2009

ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే..

ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు
అంతరాంతరములెంచి చూడ పిండంటే నిప్పటే అన్నట్లు

కొలుతురు మిము వైష్ణవులు కూరిమితో విష్ణుడని
పలుకుదురూ మిము వేదాంతులు పరబ్రహ్మంబనుచూ
తలుతురు మిము శైవులూ, తగిన భక్తులునూ శివుడనుచూ
అలరి పొగడుదురూ కాపాలికులూ ఆది భైరవుండనుచూ

సరి నెన్నుదురు శాక్తేయులు శక్తి రూపు నీవనుచూ
దర్శనములు మిము నానా విధులను తలపుల కొలదుల భజింతురూ
సిరుల మిమునే అల్ప బుద్ధి తలచిన వారికి అల్పంబగుదువు
గరిమల మిమునే ఘనమని తలచిన ఘన బుద్ధులకు ఘనుడవూ
నీవలన కొరతే లేదు మరి నీరు కొలది తామెరవూ
ఆవల భాగీరథి దరి బావుల ఆ జలమే ఊరిన యట్లు
శ్రీ వేంకట పతి నీవైతే మము చేకొని ఉన్న దైవమని
ఈవలనే నీ శరణనెదను, ఇదియే పర తత్త్వము నాకు



This is beautiful song with unfathomable philosophical depth. The ending of the song suggests that annamayya composed this song well after he embraced shree vaishnavism, we will discuss it at the end.

Meaning:

1. whoever
imagines you, in whatever form or nature, you are only that much.
2. as if one says
(when examined carefully) the flour is nothing but bread (saying so is non-sense! because flour is the base material for bread. But, those make no-sense if they conclude flour from the bread)

3. vaishanavites worship you as Vishnu (hence vaishnavites think of you as Vishnu)
4. vedantins say you are the supreme being (parabrahman)
5. shaivaites and so think of you as Shiva (you are Shiva now)
6. and then kaapalikas (practitioner of tantra) praise you as Kalabhairava (Kalabhirava is the bread in that house)

7. shakteyas (worshippers of Shakthi, the feminine principle of divinity) precisely identify you as as Shakthi (and so you are seen as Shakthi)
8. the six philosophies (darshanas) describe you in various ways according to their philosophy (in no apparent agreement)
9. for those silly-minded who associate you with wealth, you become that sillyness (for those who associate you with material things, you are that material thing)
10. but for those who see you as greater than the greatest you become that greatness
11. there is no scarcity in you, but you are the lotus by the water (nothing that is small and scarce in you, but you are made by the maker, as lotus grows according to the water in which it lives)
12. just like the wells on the banks of Ganges spring up the same Ganges water (the concept we have is likened to a well. the ideas that spring in that well are not different from the philosophy that flows in us)
13. O Lord Venkateswara, I would say you are the God holding us
14. I surrender to Thee, right here (in this realm itself), and you are the ultimate and everything for me (whatever could be the other imaginations and explanations). (this is the ultimate sharanagathi - complete surrender, the central principle of Shree Visisthadvaitha)

Tuesday, May 5, 2009

పరిపూర్ణ గరుడాద్రి పంచాననం

పరిపూర్ణ గరుడాద్రి పంచాననం
పరమం సేవే పంచాననం

దివిజ పంచాననం
తీవ్ర నఖ కాననం
కువలయాకాశ సంఘోష పంచాననం
పరితప్త దంతరవ పంచాననం

శ్రీ వెంకటాఖ్య ఘన శిఖరి పంచాననం
పావనం పంచ ముఖ పంచాననం
సేవిత ప్రహ్లాద సిద్ధి పంచాననం
భావితం శ్రీ యుక్త పంచాననం

కొలని దోపరికి గొబ్బిళ్ళో

కొలని దోపరికి గొబ్బిళ్ళో
యదు కుల స్వామికిని గొబ్బిళ్ళో


కొండ గొడుగుగా గోవుల గాచిన
కొండొక శిశువుకు గొబ్బిళ్ళో

దుండగంపు దైత్యుల కెల్లను
తల గుండు గండనికి గొబ్బిళ్ళో


పాప విధుల శిశుపాలుని తిట్టుల
కోపగానికిని గొబ్బిళ్ళో

యేపున కంసుని ఇడుముల బెట్టిన
గోప బాలునికి గొబ్బిళ్ళో


దండి వైరులను తరిమిన దనుజుల
గుండె దిగులునకు గొబ్బిళ్ళో

వెండిపైడి యగు వేంకట గిరిపై
కొండలయ్యకును గొబ్బిళ్ళో